బ్రిటిష్ సామ్రాజ్యవాదుల సింహ స్వప్నం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 98 వ వర్ధంతి సందర్భంగా పి వై ఎల్, పీ డీ ఎస్ యూ ఆధ్వర్యంలో స్థానిక కామేపల్లి మండల కేంద్రంలో అల్లూరి చిత్రపటానికి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ప్రగతిశీల యువజన సంఘం పి వై ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ వి రాకేష్ మాట్లాడుతు బ్రిటిష్ వలసవాదులకు వ్యతిరేకంగా విశాఖ మన్యం ప్రాంతంలో అడవి బిడ్డలను కూడగట్టి వారికి అక్షరాలను యుద్ధం నైపుణ్యాలను నేర్పించి పోరాట బాటలో నడిపిన అల్లూరి సీతారామరాజు స్పూర్తితో నేటి యువతరం మతోన్మాదానికి వ్యతిరేకంగా స్వదేశీ పాలకుల దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదామని మన్యం వీరుడు అల్లూరి ఆనాడు ఈ దేశ సంపదను దోచుకుంటున్న వలస వాదులకు వ్యతిరేకంగా పోరాటం చేశాడని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయి విద్యార్ధి యువకులు అల్లూరి అందించిన స్ఫూర్తితో నేడు ఈ మోడీ, కెసిఆర్ ప్రభుత్వం ఈ దేశ సంపదను అంబానీలకు ఆదాని లకు స్వదేశీ విదేశీ బడా పెట్టుబడిదారులకు కట్ట పెడుతున్న తీరుకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో నాగరాజు నరసింహ జంపన్న రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.







