రాహుల్ గాంధీ వరంగల్ సభ ఎలా జరుగుతుంది అనే విషయం పై తెలంగాణ కాంగ్రెస్ లో టెన్షన్ కనిపించినా, సభ సూపర్ సక్సెస్ కావడం, ఊహించని విధంగా జన సందోహం రాహుల్ సభలో కనిపించడం తెలంగాణ కాంగ్రెస్ లో ఉత్సాహం పెంచింది.దాదాపు 5 లక్షల మంది వరకు ఈ సభకు హాజరు అవుతారని కాంగ్రెస్ నేతలు అంచనా వేశారు.
హాజరైన వారి సంఖ్య పై సరైన లెక్క లేకపోయినా, భారీగానే జనాలు హాజరవడం, పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా రాహుల్ సభకు హాజరు కావడం కాంగ్రెస్ కు ఊరట కలిగించింది.ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఇది ఎంతో క్రెడిట్ తెచ్చిపెట్టింది.
అయినా ఆయన పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా రాహుల్ తెలంగాణలో అడుగు పెట్టారు.ఈ మొదటి సభ విజయవంతం కావడంతో ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి.
ముఖ్యంగా వరంగల్ లోనే ఈ సభను నిర్వహించాలని రేవంత్ తీసుకున్న నిర్ణయం సరైనదని ఇప్పుడు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.రాహుల్ విషయానికొస్తే ఏడాదికో, రెండేళ్ళకో ఒకసారి తెలంగాణకు ఆయన వస్తూ ఉంటారు.
అలా వచ్చిన సందర్భంలో రాహుల్ సభ ఖర్చులను భరించగలిగిన నియోజకవర్గంలోనే సభను ఏర్పాటు చేయడం తెలంగాణ కాంగ్రెస్ లో ఆనవాయితీగా వస్తోంది.కానీ దానికి భిన్నంగా రేవంత్ వరంగల్ ను ఎంచుకున్నారు.
రాజకీయంగా కీలక ప్రాంతమైన వరంగల్ లో సభ సక్సెస్ చేయడం ద్వారా , రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపించవచ్చు అని రేవంత్ సరిగ్గా అంచనా వేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికీ వరంగల్ లోని 12 నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ వాతావరణం ఉంది.
ఈ నియోజకవర్గాల్లో బీజేపీ కంటే కాంగ్రెస్ కి ఎక్కువ ఆదరణ ఉంది బలమైన కేడర్ ఉండడం తో ఇప్పుడు రాహుల్ సభ ద్వారా వారంతా యాక్టివ్ అవుతారు.

అలాగే టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజల్లో రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ వైపే మొగ్గు చూపేందుకు ఈ సభ ఎంతగానో దోహదం చేస్తుందని కాంగ్రెస్ నేతల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.వరంగల్ సభ నిర్వహించడం ద్వారా ఆ ప్రభావం తప్పకుండా ఉంటుందని కాంగ్రెస్ కు ఇది కలిసి వస్తుందని కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.వరంగల్ లో రాహుల్ సభ సక్సెస్ కాగా.
రేవంత్ సభను సక్సెస్ చేసే విషయంలో రేవంత్ డబుల్ సక్సెస్ అయ్యారు.







