వైరల్: తన భార్య శవంతో 21 ఏళ్లుగా సహజీవనం.. చివరకు..?!

భార్యాభర్తల మధ్య ఉండే సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.వివాహం జరిగిన దగ్గర నుంచి ఒకరికి ఒకరుగా ఉంటూ జీవితంలోసాగిపోవాలని కోరుకుంటారు.

 Bangkok Man Who Lived With His Wife Dead Body For 21 Years Details, Wife, Husban-TeluguStop.com

అయితే, ప్రస్తుతం మన సమాజంలో రకరకాల కారణాలతో భార్యలను వేధించేవారు.పెళ్ళయిన రెండు నెలల్లోనే విడాకుల కోసం కోర్టుకు ఎక్కాలని ప్రయత్నించే వారు.

ఎక్కువగా కనిపిస్తున్నారు.అయితే, ఇది నాణానికి ఒకవైపు మాత్రమే.

భార్యను గుండెల్లో పెట్టుకుని ప్రేమించే భర్తలూ చాలా మందే ఉన్నారు.అలాంటి ఓ వ్యక్తి గురించే ఇప్పుడు మనం చెప్పబోతున్నాం.

భార్య చనిపోయినా ఆమెను మర్చిపోలేక భార్య మృత దేహంతో దాదాపు 21 ఏళ్ళు జీవించాడు.చివరకు ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన తన భార్యకు తుది వీడ్కోలు పలికాడు.

శ్రీరాముడు అశ్వమేధ యాగం కోసం సీతాదేవి స్వర్ణ విగ్రహాన్ని తయారు చేయించి ఆ యాగాన్ని పూర్తి చేసినట్టు చూశాం.అంతటి ప్రేమను ఇప్పుడు ఓ వ్యక్తి మరణించిన భార్య పట్ల చూపిచడం విశేషం.

థాయ్‌ల్యాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లోని బ్యాంగ్ ఖేన్ జిల్లాలో విశ్రాంత సైనికాధికారి చార్న్ జన్వాచకల్ నివాసం ఉంటున్నారు.చార్న్ జన్వాచకల్ భార్య అనారోగ్యంతో రెండు దశాబ్దాల క్రితం మరణించింది.

దీంతో చార్న్ జన్వాచకల్ విపరీతంగా కుంగిపోయారు.తన భార్యను మరచిపోలేకపోయారు.

ఆమెను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని గుప్తా సరికొత్తగా ఆలోచించారు.

Telugu Bangkok, Lived, Thailand, Latest-Latest News - Telugu

అయితే అప్పటి నుంచి భార్య మృతదేహాన్ని శవపేటికలో ఉంచి ఇంటిలోనే భద్రంగా చూసుకున్నాడు.ఇప్పుడు జన్వాచకల్ వయసు 72 ఏళ్ళు. దీంతో తన భార్య మృత దేహాన్ని ఇక భద్రపరచలేనని భావించినట్లు ఉన్నాడు.

చివరకు అంత్యక్రియలు నిర్వహించాడు.భార్య దహన సంస్కారాలు చేయడానికి ఫెట్ కాసెమ్ బ్యాంకాక్ ఫౌండేషన్ నుండి సహాయం తీసుకుని కర్మకాండ పూర్తి చేశాడు.అంతటితో ఊరుకోలేదు.చితాభస్మాన్ని ఓ కలశంలో ఉంచి ఇంటికి తీసుకుపోయాడు.ఈ దహన సంస్కారాల ఫోటోలను ఫేస్ బుక్ లో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube