ఈ రోజుల్లో టాలెంట్ చూపించడానికి, పాపులర్ అవ్వడానికి సోషల్ మీడియా బెస్ట్ ప్లాట్‌ఫామ్‌గా నిలుస్తోంది.పోలీసులు కూడా సోషల్ మీడియాని వాడేస్తూ ప్రజలకు చేరువ అవుతున్నారు.
అయితే తాజాగా ఒక పోలీసు అధికారి మాత్రం తన అద్భుతమైన ఒక ప్రతిభను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.ఎప్పుడూ ప్రజలను సంరక్షిస్తూ ఉండే పోలీసుల్లో కూడా ఇలాంటి ప్రతిభ ఉంటుందా అని చాలామంది అవాక్కవుతున్నారు.
ఇంతకీ అతని ప్రతిభ ఏంటంటే.ర్యాప్ చెయ్యడం.సాధారణంగా ర్యాప్ చేయాలంటే చాలా ప్రతిభ కావాలి.గుక్క తిప్పుకోకుండా ఓకే టోన్ కంటిన్యూ చేస్తూ పాడాలి.
అయితే ఈ పోలీసు అధికారి అదరగొట్టేసారు.ఈ అధికారి తన కారులో ర్యాప్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఈ ర్యాప్ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు.ఈ అధికారి ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.
ఈ వీడియోను ‘vvekverma’ అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ అప్‌లోడ్ చేసింది.ఈ వీడియోను ఇప్పటివరకు వేల మంది యూజర్లు వీక్షించారు.ఈ అధికారి జమ్మూ-కశ్మీర్‌కు చెందినవారని.అతను పాలసీ డిపార్ట్‌మెంట్‌లో కూడా పనిచేస్తున్నారని ఒకరు యూజర్ కామెంట్ చేశారు.

ఈ అధికారి పేరు జీవన్ కుమార్ అని, ఆయన జమ్మూ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నారని మరికొందరు పేర్కొన్నారు.ఏది ఏమైనా ఒక ప్రొఫెషనల్ సింగర్ లాగా అద్భుతంగా పాట పాటి నెటిజన్ల మనుషులను జీవన్ కుమార్ గెలుచుకున్నారు.అయితే ఈ వీడియో పాతది అయినప్పటికీ ఇప్పుడు వైరల్ గా మారింది.సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు దాగి ఉంటాయి.అవి సందర్భం వచ్చినప్పుడు వాటంతట అవే వైరల్ అవుతాయి.తాజా వీడియో కూడా ఆ కోవకి చెందిందే.
ఈ వీడియోని మీరు కూడా వీక్షించండి.







