విశ్వక్ సేన్ కు మంచు విష్ణు ఫుల్ సపోర్ట్.. కామెంట్లు చేస్తున్న నెటిజన్లు!

టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం.ఈ సినిమా తాజాగా మే 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

 Vishnu Manchu Supports Vishwak Sen Movie Ashoka Vanamlo Arjuna Kalyanam Netizens-TeluguStop.com

ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో విశ్వక్ సేన్ చేసిన ప్రాంక్ వీడియో వివాదం గురించి మనందరికి తెలిసిందే.స్టూడియోకి రమ్మని పిలిచి గెట్ అవుట్ అంటూ దారుణంగా అవమానించడంతో అప్పుడు విశ్వక్ ఒక బూతు పదాన్ని వాడడంతో ఆ వివాదం కాస్త మరింత ముదిరింది.

అయితే ఆ తరువాత ఈ గొడవ పెద్దది అవుతూ వచ్చింది కానీ ఎక్కడా తగ్గలేదు.ఈ వివాదంలో హీరో విశ్వసించి ఎటువంటి తప్పులేదు అని అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు, మద్దతు తెలుపుతున్నారు.

సినీ ఇండస్ట్రీ నుంచి దర్శకుడు హరీష్ శంకర్, హీరో సాయి ధరమ్ తేజ్, సిద్ధు జొన్నలగడ్డ లాంటి వారు సోషల్ మీడియా వేదికగా మద్దతును తెలియజేశారు.ఇది ఇలా ఉంటే తాజాగా మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణ్ సినిమాకు తనవంతుగా సపోర్ట్ ను తెలియజేస్తూ ట్వీట్ చేశారు.

అంతేకాకుండా విశ్వక్సేన్ తో పాటు ఆ సినిమా చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.ఇదే ఇదే విషయంపై మంచు విష్ణు నెటిజన్స్ ఒక రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు.

ఇంకొందరు నెటిజన్స్ విశ్వ‌క్ సేన్ జాగ్ర‌త్త ప‌డాల‌ని ఎందుకంటే స‌న్ ఆఫ్ ఇండియా మూవీలో మోహ‌న్ బాబు గుర్తుకు వ‌స్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇదే ట్వీట్‌ పై ఇటు మెగా ఫ్యాన్స్‌, అటు మెగా యాంటీ ఫ్యాన్స్ ట్వీట్స్‌తో గొడ‌వ‌లు స్టార్ట్ చేశారు.ఒక‌రేమో ఆచార్య సినిమా కంటే స‌న్ ఆఫ్ ఇండియా మూవీ క‌లెక్ష‌న్స్ బావున్నాయంటే.మ‌రొక‌రు స‌న్ ఆఫ్ ఇండియా కలెక్ష‌న్స్ కంటే ఆచార్య సినిమా పార్కింగ్ క‌లెక్ష‌న్స్ ఎక్కువ‌గా ఉన్నాయ‌ని అంటున్నారు.

అయితే ఎక్కడో మొదలైన ఈ గొడవ ఎక్కడెక్కడికో వెలుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube