నేటి సమాజంలో హత్యలు చాలా కామన్ గా జరుగుతూ ఉన్నాయి.అసలు కారణాలు తెలుసుకుని ఒక్కోసారి పోలీసులే షాక్ కు గురవుతున్న ఘటనలు కూడా అనేకం ఉంటున్నాయి.
ఏదైనా పర్పస్ ఉండి హత్య చేస్తే వేరు కానీ ఒక్కోసారి మాత్రం కొంత మంది హత్య చేసేందుకు గల కారణాలను చెప్పినపుడు అది విని పోలీసులే నివ్వెరపోతున్నారు.ఇందుకు గల కారణాలను విన్న తర్వాత బయటి వ్యక్తులు కూడా ఆశ్చర్యపోతున్నారు.
ఇటువంటి ఘటనే ఒకటి గుంటూరు జిల్లా అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.మద్యం సేవించిన ముగ్గురు వ్యక్తులు కలిసి ఓ బిచ్చగాడిని కొట్టి చంపారు.
అసలు వారు ఆ బిచ్చగాడిని ఎందుకు చంపారా? అని అనుమానం వచ్చిన పోలీసులు అసలు సంగతేంటా? అని ఆరా తీశారు.అసలు విషయం తెలుసుకుని పోలీసులే నిర్ఘాంతపోయారు.
గుంటూరు అర్బన్ పరిధిలో మహేశ్ అనే వ్యక్తి పూటుగా మద్యం తాగి వచ్చి తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఓ బిచ్చగాడిని చావబాదారు.లోతుగా విశ్లేషణ చేసిన పోలీసులు హత్యకు గల కారణాలను వెల్లడించారు.
మహేశ్, అనిల్, సతీష్ అనే ముగ్గురు స్నేహితులు ఓ బిచ్చగాడిని పొట్టన పెట్టుకున్నారు.ఓ రోజు మహేశ్ పూటుగా మద్యం సేవించి హౌసింగ్ బోర్డు కాలనీలోకి ఎంట్రీ ఇచ్చాడు.
మహేశ్ అక్కడే ఉంటున్నాడు.

అక్కడే ఓ బిచ్చగాడు కూడా బిక్షాటన చేస్తూ జీవనం గడుపుతున్నాడు.ఇలా ఫుల్లుగా తాగి వచ్చిన మహేశ్ బిచ్చగాడికి ఒక ఇడ్లీ ప్యాకెట్ ఇచ్చాడు.ఇస్తూ నువ్ చూసేందుకు చెడ్డీ గ్యాంగ్ సభ్యుడిలా ఉన్నావ్ అని వ్యంగంగా అన్నాడు.
దీనికి బాధపడిన ఆ బిక్షగాడు మహేశ్ ఇచ్చిన ఇడ్లీ ప్యాకెట్ ను తీసుకోకుండా విసిరేశాడు.దీంతో కోపోద్రిక్తుడైన మహేశ్ తన స్నేహితులతో కలిసి ఆ బిక్షగాడిని కొట్టి, కొట్టి చంపాడు.







