విశాఖలోని అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు రైమ్స్ చదివించిన మంత్రి ఉషశ్రీ చరణ్ ….విశాఖ పరిధిలో బాగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీ చరణ్ అంగన్వాడీ టీచర్ అవతారమెత్తారు విశాఖలో అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె సందర్శించారు అక్కడ చిన్నారులకు ప్రభుత్వరంగ అందుతున్న ఆహార పదార్థాలు ఇతర అంశాలను పరిశీలించారు చిన్నారులతో కలిసి మెనూ భోజనాన్ని తీసుకున్నారు అంతకు ముందు ఆమె చిన్నారులకు వివిధ అంశాలపై ప్రశ్నించారు.
టీచర్ మాదిరిగా వారితో రైమ్స్ చదివించారు.చిన్నారులు కూడా హుషారుగా మంత్రి ఉష శ్రీ చరణ్ తో గడిపారు.
అనంతరం ఆమె గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేశారు.ఐదేళ్లు నిండిన చిన్నారులకు ఫ్రీ గ్రాడ్యుయేషన్ చేశారు.







