ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో యువ నటుడి పేరు మారుమోగి పోతుంది.తక్కువ సమయంలోనే ఇండస్ట్రీ లోకి వచ్చి మంచి పేరు సంపాదించుకున్న హీరోల్లో విశ్వక్ సేన్ ఒకరు.
ఈయన యూత్ ను బాగా ఆకట్టు కున్నాడు.తాను హీరోగా నటించిన ఫలక్ నమ దాస్ సినిమాతో ఈయన విమర్శకుల ప్రశంసలు అందుకుని యువ హీరోల్లో ఒకరిగా స్థానం సంపాదించు కున్నాడు.
స్టార్ హీరో కాకపోయినా విశ్వక్ సేన్ డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ అదరగొడుతాడు.తాజాగా ఈయన అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాలో నటించాడు.ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది.ఈ సినిమా కోసం విశ్వక్ సేన్ చాలా కష్టపడ్డాడు.
ఎన్నో వివాదాలను ఎదుర్కొని మరీ తాను పడిన కష్టానికి ప్రతిఫలం సంపాదించు కున్నాడు.ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చింది.
ఈయన తన సినిమాలను భిన్నంగా పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటాడు.

ఏం చేస్తే జనాలు తన గురించి మాట్లాడుకుంటారో ఆయనకు బాగా తెలుసు.ఈసారి ఈయన ప్రొమోషన్స్ మాత్రమే కాకుండా దేవి నాగవల్లి, టీవీ 9 కూడా తోడైంది.దీంతో ఈయన సినిమా మరింత ప్రోమోట్ అయ్యింది.
గత రెండు మూడు రోజులుగా ఈయన గురించే అందరు మాట్లాడు కుంటున్నారు.
అలా అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాపై భారీ హైప్ ఏర్పడింది.

అదే హైప్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అంతే హిట్ టాక్ తెచ్చుకుంది.ఈయన సినిమాకు సెలెబ్రిటీలు సైతం రివ్యూ ఇచ్చారు.ప్రేక్షకుల కామెంట్స్ కూడా అదిరిపోతున్నాయి.దీంతో ఎక్కడ చుసిన ఈ సినిమా పేరు మారుమోగి పోతుంది.ఇలా విశ్వక్ సేన్ ను విమర్శించినా వారి ముందు కలర్ ఎగరేసి మరీ హిట్ అందుకున్నాడు.మరి ఈ విజయం ఈయనకు కూడా ఎప్పటికి గుర్తు ఉండి పోతుంది.







