గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో దేవి నాగవల్లి చేసిన కామెంట్ల గురించి చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.దేవి నాగవల్లిని సపోర్ట్ చేసేవాళ్లను సైతం నెటిజన్లు తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తుండటం గమనార్హం.
అయితే గతంలో ఒక సందర్భంలో దేవీ నాగవల్లి సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసి తన ఫ్యామిలీ, బ్యాగ్రౌండ్ గురించి ఇతర విషయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బిగ్ బాస్ సీజన్4 ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న దేవీ నాగవల్లి చాలామంది మీరు ఏం చేస్తుంటారని ఇవన్నీ ఎలా కవర్ చేస్తారని అడుగుతూ ఉంటారని భయం వేయదా అని రిస్క్ ఎందుకు చేస్తారని అడుగుతారని తాను రాజమండ్రిలో పుట్టానని అక్కడే పెరిగానని రాజమండ్రిని దాటి వెళ్లడం కూడా తనకు తెలియదని అమ్మానాన్న నా ప్రపంచం అని ఎప్పుడూ ఇంట్లోనే ఉండేదానినని ఆమె చెప్పుకొచ్చారు.
అమ్మాయి ఉద్యోగం చేస్తానంటే ఒప్పుకోని ఫ్యామిలీ నుంచి తాను వచ్చానని బీకామ్ చదువుతున్న సమయంలో తాను గ్రాఫిక్స్ నేర్చుకుని అక్కడే ట్యూటర్ గా చేశానని ఆమె అన్నారు.ఇంట్లో న్యూస్ ఛానెల్ లో జాబ్ వచ్చిందని అబద్ధం చెప్పి ఆ తర్వాత సెలెక్ట్ అయ్యి కొత్త ప్రపంచంలోకి వచ్చానని ఆమె తెలిపారు.
ఆఫీస్ దగ్గరలో ఉండే హాస్టల్ లో తాను ఉన్నానని ఆమె తెలిపారు.ఒకసారి ఒకమ్మాయి ఆత్మహత్య చేసుకుందని ఆ సమయంలో అమ్మాయి నాన్న ఏడుపును చూసి కన్నీళ్లు వచ్చాయని దేవీ నాగవల్లి వెల్లడించారు.

తండ్రి ఆవేదనను అర్థం చేసుకోవాలని పిల్లలు ఆత్మహత్య చేసుకోవద్దని తాను రిపోర్టింగ్ చేశానని పోలీసుల దర్యాప్తులో నాన్నే ఆ అమ్మాయిని చంపాడని తేలిందని దేవీ నాగవల్లి అన్నారు.ఈ విషయం తెలిసి తాను తిండి తినలేదని, నిద్రపోలేదని గిల్టీ ఫీలింగ్ తో గడిపానని ఆమె కామెంట్లు చేశారు.ఎమోషన్ లో మనం నిజం చూడలేమని తాను అప్పటినుంచి కఠినంగా ఉండటం అలవాటు చేసుకున్నానని ఆమె తెలిపారు.తాను వర్క్ లో ఉన్నప్పుడు ఒకలా వర్క్ లో లేనప్పుడు మరోలా ఉంటానని దేవీ నాగవల్లి కామెంట్లు చేశారు.







