యాంకర్ గా సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్న సుమ నటిగా ఎట్టకేలకు రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యింది.జయమ్మ పంచాయితీ అనే సినిమా తో సుమ రీ ఎంట్రీకి సిద్దం అయిన విషయం తెల్సిందే.
ఆమె యాంకర్ గా దక్కించుకున్న స్టార్ డమ్ నేపథ్యం లో జయమ్మ పంచాయితీకి భారీ క్రేజ్ దక్కింది.సినిమా నుండి రెండు ట్రైలర్ లను విడుదల చేయడంతో పాటు టీజర్ మరియు పోస్టర్ లను పెద్ద ఎత్తున విడుదల అయ్యాయి.
వాటన్నింటి ఆదారంగా చేసుకుని నెటిజన్స్ సినిమా కథను అల్లేశారు.ఇప్పుడు అదే కథ ఈ సినిమా కథ అంటూ ప్రచారం జోరుగా సాగుతోంది.
కథ విషయానికి వస్తే… జయమ్మ ఊర్లో ప్రతి ఒక్కరితో సన్నిహితంగా ఉంటుంది.అందరి తలలో నాలుక మాదిరిగా ఉండి ఏ సమస్య వచ్చినా తన వంతు సాయం అందిస్తూ ఒక సాదా సీదా వ్యవసాయ జీవనం సాగిస్తూ ఉంటుంది.
అలాంటి జయమ్మ కుటుంబంలో ఒడిదొడుకులు మొదలు అవుతాయి.
ఒక వైపు ఆమె భర్త అనారోగ్యం బారిన పడతాడు.
ఆపరేషన్ చేయాలంటూ డాక్టర్ లు చెబుతారు.అప్పుడే కూతురు విషయంలో కూడా కొన్ని సమస్యలు వస్తాయి.
మొదటగా భర్త ఆపరేషన్ చేయించేందుకు డబ్బును వెదికే సమయంలో కూతురు పెద్దమనిషి అవ్వడంతో కార్యక్రమం నిర్వహించాలని భావిస్తుంది.కూతురు కార్యక్రమం నిర్వహించగా వచ్చిన కట్నాలతో భర్తకు ఆపరేషన్ చేయించాలని భావిస్తుంది.
తాను ఊర్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా వెళ్లి కట్నం పెట్టి వచ్చేదాన్ని కనుక తనకు కూడా చాలా కట్నాలు వస్తాయని ఆమె భావిస్తుంది.కాని ఊహించింది జరుగదు.
దాంతో జయమ్మ పంచాయితీ పెడుతుంది.ఇలాంటి విషయాలకు కూడా పంచాయితీ పెడతారా అంటూ జయమ్మ పై పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దాంతో పోలీస్ స్టేషన్ కు వెళ్తుంది.అక్కడ ఏం జరిగింది.
అసలు జయమ్మ కు కావాల్సిన డబ్బులు వచ్చాయా.కూతురు విషయం ఏంటీ అనే విషయాలతో కథ సాగుతుందట.
ఇదే కథ నిజం అయితే తప్పకుండా సుమ కు సక్సెస్ ఖాయం అంటున్నారు.మరి కొన్ని గంటల్లో సినిమా రాబోతుంది.
కనుక ఇప్పటి నుండే హడావుడి అక్కర్లేదు.