ఈ మద్య కాలంలో సినిమా లకు ఓటీటీ రైట్స్ ద్వారా పంట పండుతున్నాయి.చిన్న సినిమాలకు మరియు పెద్ద సినిమాలకు భారీ మొత్తంలో ఓటీటీ రేటు పలుకుతున్న నేపథ్యంలో ఫిల్మ్ మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని సినిమాలకు మంచి క్రేజ్ వస్తే కేవలం ఓటీటీ రైట్స్ ద్వారానే ఆ సినిమా యొక్క బడ్జెట్ రికవరీ అవుతుంది.అంతలా ఓటీటీ బిజినెస్ జరుగుతుంది.
ఇక ఇటీవల కాలంలో పెద్ద సినిమాలను ఒక్క ఓటీటీ సంస్థలు కొనుగోలు చేయలేక రెండు ఓటీటీ లు కొనుగోలు చేసి స్ట్రీమింగ్ చేస్తున్నాయి.ఇటీవల విడుదల అయిన పవన్ కళ్యాణ్ మరియు రానా ల భీమ్లా నాయక్ సినిమా రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై స్ట్రీమింగ్ అయిన విషయం తెల్సిందే.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మరియు ఆహా ఓటీటీ లో ఈ సినిమా ను స్ట్రీమింగ్ చేశారు.అక్కడ ఇక్కడ కూడా భారీ ఎత్తున వ్యూస్ దక్కాయి.

రెండు ఓటీటీ లు కూడా బాగా లాభం పొందరు అనేది టాక్.ఇక అదే ఫార్ములాను ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ విజయ్ సినిమా బీస్ట్ కు అప్లై చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.తాజాగా ఈ సినిమా ను ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.ఈ సినిమా ను సన్ పిక్చర్స్ వారు నిర్మించారు కనుక సన్ నెక్ట్స్ లోనే సినిమా స్ట్రీమింగ్ అవుతుందని అంతా భావించారు.
కాని అనూహ్యంగా ఈ సినిమా ను నెట్ ఫ్లిక్స్ లో కూడా స్ట్రీమింగ్ చేయబోతున్నారు.రెండు ఓటీటీ ల యొక్క సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా ఆ విషయాన్ని తెలియజేశారు.
బీస్ట్ సినిమా ను ఈనెల 11 నుండి రెండు ఓటీటీ ల ద్వారా స్ట్రీమింగ్ అవ్వబోతుంది.ఆ విషయం పై అధికారిక క్లారిటీ రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రెండు ఓటీటీ ద్వారా రావడం వల్ల ఎక్కువ మంది జనాలకు చేరువ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.