టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వరుస సినిమాలతో బిజీగా ఉన్నటువంటి మహేష్ బాబు సినిమా షూటింగ్ లలో ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా తన కుటుంబంతో గడపడానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.
ఈ క్రమంలోనే ఏడాదికి మూడు నాలుగు సార్లు హాలిడే వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఉండే మహేష్ బాబు తాజాగా తన ఫ్యామిలీతో కలిసి ప్యారిస్ వెళ్ళిన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే వీరి ప్యారిస్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఫ్యామిలీతో పాటు ప్యారిస్ వెళ్లిన మహేష్ బాబు ప్యారిస్ లో లగ్జరీ హోటల్ లీ బ్రిస్టల్ ప్యారిస్‌లో దిగడం మహేష్ బాబుకు అలవాటు.ఎంతో విలాసవంతమైన హోటల్లో అద్భుతమైన సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
అందుకే మహేష్ బాబు పారిస్ వెళ్ళినప్పుడు ఇదే హోటల్లో స్టే చేస్తారు.ఇక ఈ హోటల్ లో ఒక రోజుకు రూమ్ రెంట్ మహేష్ బాబు ఎంత చెల్లిస్తారు అనే విషయం తెలిస్తే ప్రతి ఒక్కరూ షాకవ్వాల్సిందే.
అత్యాధునిక సదుపాయాలు కలిగినటువంటి ఈ రూమ్ కి మహేష్ బాబు రోజుకు అక్షరాల లక్షన్నర రూపాయలు రెంట్ చెల్లిస్తారట.ఎంతైనా మహేష్ బాబు రేంజ్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే.

ఈ విధంగా మహేష్ బాబు తన కుటుంబం కోసం తన విలువైన సమయాన్ని కేటాయిస్తూ అందరూ ఎంతో సంతోషంగా ఉండడానికి ప్రాధాన్యత ఇస్తారు.ఇక ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న సర్కారీ వారి పాట సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ క్రమంలోనే ప్యారిస్ పర్యటనలో ఉన్న మహేష్ బాబు నేడు ఇండియాకి తిరిగి రానున్నట్లు నమ్రత సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.ఇండియాకు వచ్చిన వెంటనే మహేష్ బాబు తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ కానున్నారు.







