తెలంగాణలో ఏడాదిన్నర ముందే ఎలక్షన్ మూడ్

తెలంగాణ రాజకీయాలపై బీజేపీ అగ్రనేతలు ఫోకస్ పెట్టారు.ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు పొలిటికల్ హీట్ గా మారుతున్నాయి.

 Election Mood In Telangana A Year And A Half Ago Bjp Trs Details, Election Mood,-TeluguStop.com

అయితే వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీఆర్ఎస్ పార్టీని గద్దె దించడం కోసం బీజేపీ పార్టీ కేంద్ర, రాష్ట్ర ముఖ్య నేతలు రంగంలోకి దిగుతున్నారు.తెలంగాన రాష్ట్ర బీజేపీ నాయకులతో పాటు ఢిల్లీ అధిస్టానం నాయకులు ఒక్కొక్కరుగా తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు.

ఇప్పటికే తెలంగాణలో బీజేపీ నేతలు ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి శ్రీకారం చుట్టారు.బండి సంజయ్ చేప్పట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఇశాళ్టితో 22 వ రోజుకు చేరుకుంది.

అయితే బండి సంజయ్ యాత్ర ద్వారా టీఆర్ఎస్ సర్కార్ పరిపాలన వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడానికి బండి సంజయ్ ప్రంజాసంగ్రామం యాత్ర కొనసాగిస్తున్నారు.ముఖ్య మంత్రి కేసీఆర్ పనితీరును ప్రశ్నిస్తూ, కేసీఆర్ కుటుంబ పాలన రాజకీయాలను నిలదీస్తున్నారు బండి సంజయ్.

ఇక తెలంగాణలో దూకుడు మీద ఉన్న బీజేపీ నేతలకు అండగా బీజేపీ కేంద్రమంత్రులు బండి సంజయ్ సపోర్ట్ గా తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పర్యటింస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు రానున్నారు.

మహబూబ్ నగర్ కొనసాగుతున్న బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో జేపీ నడ్డా పాల్గొంటారు.అయితే యాత్రలో భాగంగా ప్రజా గోస- బీజేపీ భరోసా పేరుతో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ భారీ సభను నిర్వహించనున్నారు.

ఈ సభలో కేంద్రమంత్రి జేపీ నడ్డా పాల్గొంటారని బీజేపీ నేతలు చెబుతున్నారు.అలాగే రాష్ట్ర బీజేపీ నేతల,కార్యకర్తలు ముఖ్య నేతలతో జేపీ నడ్డా సమావేశమై కీలక విషయాలు చర్చించున్నట్లు బీజేపీ శ్రేణులు చెబుతున్నారు.

వారితో బండి సంజయ్ చేప్పట్టిన ప్రజా సంగ్రామ యాత్ర తీరు, తెలంగాణ రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించి భవిష్యత్ కార్యచరణ చేయనున్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా.

Telugu Amit Sha, Bandi Sanjay, Bjp Trs, Cm Kcr, Mood, Jp Nadda, Mahabubnagar, Pr

మరోవైపు కేంద్ర మంత్రి అమిత్ షా సైతం మే 14వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు.రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో నిర్వహించే రెండవ దశ ప్రజా సంగ్రామ యాత్ర చివరి భారీ సభలో కేంద్రమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటుగా,వచ్చే ఎన్నికల ఎజెండాను ఖరారు చేయడం, పార్టీ కార్యకర్తలకు చర్చించి టీఆర్ఎస్ చేస్తున్న బీజేపీ నేతలపై దాడులు గురించి కేంద్రమంత్రి అమిత్ షా చర్చించనునున్నారు.

అయితే బీజేపీ పార్టీ ఎప్పుడు కార్యకర్తలకు అండగా ఉంటుందని బలమైన మేసేజ్ తెలియజేయడం వచ్చే ఎన్నికల్లో గేలుపే లక్ష్యంగా బీజేపీ అగ్రనేతలు తెలంగాణ రాష్ట్రం ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి శ్రీకారం చుట్టుతున్నారు.

Telugu Amit Sha, Bandi Sanjay, Bjp Trs, Cm Kcr, Mood, Jp Nadda, Mahabubnagar, Pr

అయితే ఇవాళ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జరగనున్న బహిరంగ సభ బీజేపీ నేతలు ఏర్పాటు చేశారు.ఈ సభకు కేంద్రమంత్రి జేపీ నడ్డా , పార్టీ కీలక నేతలు హాజరుకానున్నారు.అయితే ఈ సభ ద్వారా బీజేపీ నేతలు తెలంగాణ రాష్ట్రంపై స్పష్టమైన వైఖరిని స్పష్టం చేయనున్నట్లు సమాచారం.

మరో ఏడాదిన్నరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజల కోసం బీజేపీ పార్టీ భరోసా పేరుతో, తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పరిస్థితులను తెలియజేసి, వారికి ఏ విధంగా అండగా నిలవబోతుందో చెప్పే ప్రయత్నాలు చేస్తారని టాక్.తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, ఆపై జరగనున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిజెపి అగ్రనాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube