ఖమ్మం జిల్లా పాలేర్ నియోజకవర్గం మద్దులపల్లి నందు 19.90 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న వ్యవసాయ మార్కెట్ యార్డు నిర్మాణ పనులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మేల్యే కందాల ఉపేందర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.







