తెలంగాణలోనే దాడులు చేస్తున్నారన్న గంగుల ధాన్యం సేకరణ పూర్తయిన తర్వాత తనిఖీలు చేయాలని విన్నపంరైస్ మిల్లుల్లో జరుగుతున్న అక్రమాలపై ఎఫ్సీఐ అధికారులు దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ దాడులపై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ స్పందిస్తూ… దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
రైతులు సజావుగా తమ ధాన్యాన్ని అమ్ముకోకుండా చేసే కుట్రలో భాగంగానే ఇది జరుగుతోందని అన్నారు.రాష్ట్రంలో కొనుగోళ్లు ప్రారంభం కాగానే దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు.
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఇదంతా చేస్తున్నారని చెప్పారు. రైస్ మిల్లులు కొనే వడ్లు మాయం కావని, కొనుగోళ్లు పూర్తయ్యాక ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలని అన్నారు.
తనిఖీలు నిర్వహించే అధికారం కేంద్రానికి ఉందని… అయితే దీని వల్ల ధాన్యం సేకరణ ఆగిపోతుందని చెప్పారు.రైతులు ఇబ్బంది పడతారని అన్నారు
.






