టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించిన చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో విశ్వక్ సేన్ చేసిన ఒక ప్రాంక్ వీడియో పెద్ద వివాదానికి కారణమైన విషయం తెలిసిందే.
అయితే ఇప్పటివరకు సోషల్ మీడియాలో, పెద్ద దుమారం రేపిన ఈ వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వరకు వెళ్ళింది.సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చేసిన ఫ్రాంక్ వీడియోలో విశ్వక్ సేన్ కు భాగం అవ్వడంతో ఈ వివాదం మరింత చెలరేగింది.
అయితే ఈ ప్రాంక్ వీడియో లో కొత్త కొత్త సినిమాలు విడుదల రోజున థియేటర్స్ వద్ద పిచ్చి పిచ్చిగా రివ్యూ లు ఇస్తూ హంగామా చేసే రివ్యూ లక్ష్మణ్ నానా హంగామా చేసిన విషయం తెలిసిందే.ఈ వ్యవహారం గురించి సోషల్ మీడియాలో గత రెండు మూడు రోజులుగా పలు రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
ఇక ఈ వ్యవహారం కాస్త టీవీ9 ఛానల్ డిబేట్ వరకు వెళ్లడం అక్కడ యాంకర్ దేవి నాగవల్లి హీరో విశ్వక్ సేన్ ని గెట్ అవుట్ మై స్టూడియో అంటూ అవమానించడం ఇలా చూస్తుండగానే ఈ వ్యవహారం పెద్ద వివాదంగా మారిపోయింది.ఇదిలా ఉంటే తాజాగా మరొక వీడియో బయటకు వచ్చింది.

అందులో బ్రో అర్జున్ కుమార్ అల్లం ఎక్కడ ఉన్నాడో ఇప్పటికైనా చెప్పు బ్రో అని అనగా.అరే నువ్వు చేసింది సరిపోలేదా రా అంటూ విశ్వక్ సేన్ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు.నువ్వు ఏదైనా గోల చేసేది ఉంటే ఆరవ తారీఖు థియేటర్స్ వద్ద చెయ్ లేదా థియేటర్ లోపల చెయ్ బయట చేస్తే నన్ను వేసుకుంటారు అంటూ సరదాగా అనడం ఈ వీడియోలో మనం గమనించవచ్చు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.







