సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు.
నిన్న మొన్నటి వరకు ఈ సినిమా పై ఒకింత అపనమ్మకం అనేది ఉంది.ఎందుకంటే ఈ సినిమాకు ముందు వరకు దర్శకుడు పరశురామ్ చిన్నా చితక సినిమాలు చేశాడు.
చిన్న హీరోలతో సినిమాను చేశాడు.గీత గోవిందం సినిమాను తెరకెక్కించి భారీ విజయాన్ని అయితే దక్కించుకున్నాడు కాని మాస్ సినిమాను.
అది కూడా మహేష్ బాబు వంటి సూపర్ స్టార్ ను ఎలా డీల్ చేస్తాడు అనే అనుమానం ప్రతి ఒక్కరిలో ఉంది.మహేష్ ఇమేజ్ ను కనీసం 10 శాతం అయినా ఈయన మ్యాచ్ చేసి సినిమాను తెరకెక్కించగలడా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.
ఆ అనుమానాలు అన్ని కూడా ట్రైలర్ విడుదల తర్వాత పటాపంచలు అయ్యాయి.
అదుగో ఇదుగో అంటూ ఎదురు చూసిన ట్రైలర్ విడుదల అయిన తర్వాత నిన్న మొన్నటి వరకు దర్శకుడు పరశురామ్ గురించి అనుమానం వ్యక్తం చేసిన వారే స్వయంగా ఆహా ఓహో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నాయి.
అద్బుతంగా సినిమా ఉండబోతుంది..మహేష్ బాబు ఇమేజ్ ను ఆయన స్టార్ డమ్ ను మ్యాచ్ చేస్తూ.ఆయన స్థాయిని నూటికి నూరు పాళ్లు సరిపోయే సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కించాడంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సినిమాలోని ప్రతి మాస్ ఎమోషన్ సన్నివేశం లో మహేష్ బాబు ను సరికొత్తగా అద్బుతంగా దర్శకుడు చూపించబోతున్నాడు.మాస్ ఎలిమెంట్స్ కు తోడు ఎంటర్ టైన్మెంట్ ను కూడా కావాల్సినంత పరశురామ్ ఇచ్చాడు.
వెన్నెల కిషోర్ ను ఫుల్ గా వాడేసినట్లుగా తెలుస్తోంది.పోకిరి.
దూకుడు రేంజ్ లో ఈ సినిమా ఎంటర్ టైన్మెంట్ ను మాస్ ఎలిమెంట్స్ ను కలిగి ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.ఈ సినిమా సక్సెస్ అయితే పరశురామ్ దశ తిరిగినట్లే.







