2019 చివరిలో చైనాలో పుట్టిన కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దారుణాలు వెలుగుచూశాయి.ఆంక్షల కారణంగా వివిధ దేశాలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాల వెళ్లిన వారు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు.
ఇప్పుడిప్పుడే పరిస్ధితులు అనుకూలిస్తున్న వేళ.ఆత్మీయులను కలుసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో బీజింగ్‌కు చెందిన భారతీయ నిపుణుల బృందం కోవిడ్ కారణంగా చైనాను విడిచిపెట్టిన తమ పిల్లలను, కుటుంబ సభ్యులను కలిసేలా సహాయం చేయాల్సిందిగా భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
చైనాలో ఆటోమొబైల్, టెక్నాలజీ, మీడియా వంటి రంగాలలో పనిచేస్తున్న కొందరు భారతీయులు కోవిడ్ కారణంగా రెండేళ్ల క్రితం స్వదేశానికి వచ్చేశారు.
అయితే వీరు తిరిగి చైనాకు వెళ్లేందుకు గాను డ్రాగన్ కఠిన నిబంధనలు అవరోధంగా మారాయి.ఈ నేపథ్యంలో తమకు సాయం చేయాల్సిందిగా వీరు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌కు లేఖ రాశారు.రెండేళ్లుగా తమ కుటుంబాలు మానసికంగా, ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని లేఖలో ప్రస్తావించారు.
తమ కుటుంబాలతో కలిసి బీజింగ్‌లో నివసిస్తున్నామని.అయితే చైనాలో 2020 ఫిబ్రవరిలో భారతదేశానికి తిరిగి వచ్చామని లేఖలో తెలిపారు.అప్పటి నుంచి వీసా అందుబాటులో లేకపోవడం, ప్రయాణ పరిమితుల కారణంగా చైనాలో వున్న తమ వారిని కలుసుకోలేకపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.పోనీ తమ వారు భారత్‌కు వచ్చేయాలని భావించినప్పటికీ.
వృత్తిని, ఉపాధిని వదులుకోవాల్సి వుంటుందని వాపోతున్నారు.

మరోవైపు.వైరస్ వెలుగు చూసిన తర్వాత విదేశీ విద్యార్ధులు తమ దేశంలో అడుగుపెట్టేందుకు చైనా ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే.దీనిపై భారత్ పలుమార్లు దౌత్యపరంగా ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ డ్రాగన్ మాత్రం కనికరించడం లేదు.ఈ పరిణామాల కారణంగా దాదాపు 23 వేల మంది భారతీయ విద్యార్ధులు రెండేళ్లుగా ఇళ్లలోనే మగ్గుతున్నారు.
ఇది వారి భవిష్యత్‌పై ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇతర దేశాల వారికి ఇటీవల కాలంలో వీసాల జారీ ప్రక్రియను ప్రారంభించిన చైనా.భారతీయుల విషయంలో మాత్రం జాప్యం చేస్తూ వచ్చింది.ఈ విషయమై భారత అధినాయకత్వం పలుమార్లు తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది కూడా.
అంతేకాదు.చైనా విశ్వవిద్యాలయాలలో చేరొద్దని మన దేశానికి చెందిన విద్యార్ధులను హెచ్చరించింది.
ఈ మేరకు నేషనల్ మెడికల్ కమీషన్ (ఎన్ఎంసీ) ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.
ఈ దెబ్బకు దిగొచ్చిన చైనా ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
దాదాపు రెండేళ్ల తర్వాత భారతీయ విద్యార్ధులను మళ్లీ తమ దేశంలోకి అనుమతిస్తామని ప్రకటించింది.ఈ దిశగా వీసా జారీ ప్రక్రియ పున: ప్రారంభించబోతున్నట్లు డ్రాగన్ తెలిపింది.చైనాలో తప్పనిసరిగా చదవాల్సిన విద్యార్థుల జాబితాను పంపించాలని భారత ప్రభుత్వానికి చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి సూచించారు.







