అప్డేట్: ఇకమీదట చాట్ లిస్ట్ లోనే వాట్సాప్ స్టేటస్..?!

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి వాట్సాప్‌ గురించి తెలిసే ఉంటుంది.ఈ కాలంలో ప్రతి ఒక్కరు కూడా ప్రముఖ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ ను విరివిగా ఉపయోగిస్తున్నారు.

 Whatsapp Status In The Chat List From Now On Whatsapp, New Updates, Technology U-TeluguStop.com

రోజురోజుకు వాట్సాప్ ను వాడే వారి సంఖ్య పెరుగుతుందే కానీ తగ్గడం లేదు.అలాగే వాట్సాప్ కూడా తన యూజర్లను ఆకట్టుకునే క్రమంలో రకరకాల ఫీచర్లను ప్రవేశపడుతూ వస్తుంది.

ఈ క్రమంలోనే తాజాగా వాట్సాప్ ఒక సరికొత్త ఫీచర్ ను మరికొద్ది రోజుల్లో మన ముందుకు తీసుకురానుంది.మరి ఆ ఫీచర్ ఏంటి.? అది అలా పని చేస్తుంది అనే విషయాలను తెలుసుకుందామా.

వాట్సాప్ స్టేటస్‌ గురించి మనకు తెలిసిన విషయమే.

వాట్సాప్ లో ప్రొఫైల్ పిక్ ఎలా అయితే పెట్టుకోవచ్చో.అలాగే వాట్సాప్ లో మన స్టేటస్‌ ను కూడా అప్డేట్ చేసుకోవచ్చు.

అయితే స్టేటస్ చూడడానికి వాట్సాప్ స్టేటస్ అనే ఒక ప్రత్యేక ట్యాబ్‌ లోకి వెళితే అక్కడ ఎవరెవరు ఏ స్టేటస్‌ పెట్టారో అనే విషయం మనం తెలుసుకోవచ్చు.అయితే ఇప్పటివరకు ఎవరెవరు ఏ స్టేటస్ లు పెట్టారనే విషయం తెలుసుకోవాలంటే కచ్చితంగా స్టేటస్ ట్యాబ్‌ లో మాత్రమే చూసే సదుపాయం కలదు.

కానీ ఇప్పుడు ఎవరి స్టేటస్ అయినా తెలుసుకోవాలంటే వాట్సాప్‌లో మరొకొత్త ఫీచర్ మనకు అందుబాటులోకి రానుంది.ఈ ఫీచర్ సహాయంతో ఇకపై మీకు తెలిసిన వ్యక్తి ఏ స్టేటస్‌ పెట్టిన ఇట్టే తెలిసిపోతుంది.

స్టేటస్ తెలుసుకోవడం కోసం వేరే ట్యాబ్ లోకి వెళ్ళావలిసిన అవసరం లేదని.ఈ ఫిచర్ త్వరలోనే అప్డేట్‌ అవ్వనుందని WABetaInfo తెలిపింది.

Telugu Latest, Ups, Wabetainfo, Whatsapp, Whatsapp Status-Latest News - Telugu

ఈ ఫిచర్ సహాయంతో మన వాట్సాప్‌ లోని చాట్‌ లిస్ట్‌ లో కనిపించే ప్రొఫైల్‌ పిక్చర్ పై క్లిక్‌ చేస్తే చాలు.వారి ప్రొఫైల్‌ పిక్‌ తో పాటుగా, వారు పెట్టుకున్న స్టేటస్‌ కూడా మనకు కనిపిస్తుంది.అంటే వారు ఏదైనా స్టేటస్ పెట్టినట్లయితే డీపీ మీద క్లిక్ చేయగానే వెంటనే స్టేటస్‌ పేజీకి వెళ్ళి ఆ స్టేటస్ కనిపిస్తుంది.ఈ కొత్త ఫీచర్‌ ద్వారా మనకు నచ్చిన వారు ఏదైనా స్టేటస్‌ పెట్టిన వెంటనే మనకు తెలిసే అవకాశం ఉంటుంది.

ఈ ఫీచర్ ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో అందుబాటులో ఉండగా ఇప్పుడు ఇదే ఫీచర్ ను వాట్సాప్ లో కూడా అందుబాటులోకి తీసుకుని రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ ఫీచర్ పై ప్రస్తుతం వాట్సాప్‌ పనిచేస్తోందని త్వరలోనే యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుందని తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube