సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించడానికి ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ వెళుతున్న సమయంలో ఆయన పై దాడి జరిగింది.సిద్దిపేట జిల్లా జక్కాపూర్ వద్ద గ్రామస్తులు కేఏ పాల్ వాహనాన్ని అడ్డుకోవడం జరిగింది.
దీంతో వాహనంలో ఉన్న కేఏ పాల్ అడ్డుకున్న వారితో మాట్లాడటానికి.వాహనం దిగి బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయగా ఓ వ్యక్తి దాడి చేశాడు.
పోలీసులు డిఎస్పి అందరూ ఉండగానే కేఏ పాల్ చెంప పై చేయి చేసుకోవడం జరిగింది.ఇదిలా ఉంటే దాడి చేసిన వ్యక్తి జిల్లెల్ల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

పోలీసుల సమక్షంలోనే తనపై దాడి జరగడంతో అక్కడున్న డిఎస్పి ని పోలీసుల పై కేఏ పాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.మీరు పోలీసులా? టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలా?.మీకు జీతం ఇస్తుంది ప్రభుత్వమా? లేకపోతే కేటీఆరా? అని ప్రశ్నించారు.రైతుల గురించి కేంద్రంలో ఉన్న మోడీ ఇటు రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ ఎవరూ కూడా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.
రైతులను పరామర్శించడానికి రావటం జరిగిందని.తాను వస్తానంటే కచ్చితంగా రావడం జరుగుతుందని.
కెఏ పాల్ తనదైనశైలిలో వ్యాఖ్యలు చేశారు.