సోషల్ మీడియా విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఏ మూల జరిగిన విషయాలైనా మనకు తెలుస్తున్నాయి.క్షణాల్లో మన ఫోన్లలో ప్రత్యక్షం అవుతుంది.
ఫలితంగా ఏ ఆసక్తికర విషయమైనా మనకు ఇట్టే తెలిసిపోతుంది.ఇందులో కొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురి చేస్తుంటే, మరికొన్ని విస్మయానికి గురి చేస్తున్నాయి.
ఇక కొన్ని వీడియోలను చూసిన వారు నోరెళ్లబెడుతుంటారు.ఇంకొన్ని వీడియోలు మాత్రం నెటిజన్లను బాగా నవ్విస్తుంటాయి.
ఇదే రీతిలో ఓ వ్యక్తి గోడకు వెరైటీగా ప్లాస్టరింగ్ చేశాడు.దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగానే విపరీతంగా వైరల్ అయింది.
గోడకు పైభాగంలో ప్లాస్టరింగ్ చేయాలంటే దగ్గరగా ఏదైనా నిచ్చెన వంటిది ఏదైనా తాపీ మేస్త్రీలు వేసుకుంటారు.చేతిలో గమేళా పెట్టుకుని, అందులోని సిమెంట్ మిశ్రమాన్ని గోడకు తాపీతో కొడుతూ ఎంతో పద్ధతిగా ప్లాస్టరింగ్ చేస్తారు.
తాజాగా వైరల్ అయిన వీడియోలో మాత్రం ఓ తాపీ మేస్త్రి వెరైటీగా ప్లాస్టరింగ్ చేస్తూ కనిపించాడు.గోడకు దూరంగా ఉంటూ ఏదో విసిరేస్తున్నట్లుగా సిమెంట్ ద్రావణాన్ని గోడకు కొడుతున్నాడు.
ఇది చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.ప్లాస్టరింగ్ ఇలా కూడా చేస్తారా అంటూ నవ్వుకుంటున్నారు.
ఎంతో పద్ధతిగా చేయాల్సిన ప్లాస్టరింగ్‌ను గోడకు విసిరికొడుతూ చాలా టెక్నిక్‌గా చేస్తున్నాడు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఈ వీడియోకు ఇప్పటికే 1.66 లక్షల వ్యూస్ దక్కగా, వేల సంఖ్యలో లైకులు వచ్చాయి.ఇతడి వెరైటీ టెక్నిక్ చూసిన నెటిజన్లు పడీపడీ నవ్వుకుంటున్నారు.షార్ట్ కట్ పద్ధతి చాలా బాగుందంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.







