శివాని రాజశేఖర్ మిస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకుంటుందా..?

తెలుగు సినీ ప్రేక్షకులకు సీనియర్ హీరో హీరోయిన్ అయిన జీవిత, రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్న విషయం తెలిసిందే.

 Shivani Rajasekhar Is Femina Miss India Tamil Nadu Details, Shivani Rajashekar,-TeluguStop.com

ఒకరు శివాని రాజశేఖర్ మరొకరు శివాత్మిక రాజశేఖర్. ఇదిలా ఉంటే తాజాగా శివాని రాజశేఖర్ మిస్ ఇండియా పోటీల్లో జాబితాలో చేరింది.

తాజాగా మిస్ ఇండియా 2022 అందాల పోటీలో తుది జాబితాలో చేరిన వారిలో శివాని రాజశేఖర్ కూడా ఒకరు.ఆంధ్ర ప్రదేశ్ నుండి వెలువడిన 8 మంది ఫైనలిస్టు లలో శివాని రాజశేఖర్ పేరు కూడా ఉంది.

ఇక ఈ పోటీల్లో శివాని రాజశేఖర్ తెలంగాణ మరియు తమిళనాడు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుందని నిర్వాహకులు తెలుపుతున్నారు.అంతేకాకుండా దేశంలోని టాప్ 31 జాబితాలో చేరేందుకు శివాని ఇప్పటికే దాదాపుగా మూడు వేలకు మందికి పైగా తోటి ఆశావహులను అధిగమించింది అని తెలిపారు.

అయితే తెలుగు రాష్ట్రాల నుంచి ఫైనల్ కు చేరిన వారిలో ఈ అందాల నటి ఒకరు అయినప్పటికీ ఆ తర్వాత దశలో తమిళనాడుకు ప్రాతినిధ్యం వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇక శివాని రాజశేఖర్ చెన్నైలో జన్మించినందుకు గాను ఆమెకు బలమైన తమిళనాడు అనుబంధం ఏర్పడింది.

Telugu Andhara, Jeevita, India, Rajasekhar, Tamil Nadu, Telangana, Tollywood-Mov

సినీ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ఎక్కువగా మద్రాసులో పుట్టి పెరిగారు.అదే చిన్నప్పటినుంచి తనకు ప్రతిష్టాత్మకంగా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనాలి అనేది తన కల అని తెలిపింది శివాని రాజశేఖర్.అందుకే ఆమెను ఇప్పటికీ సినిమాల్లో ప్రతిభ నిరూపించుకోవాలి అనుకున్నా అందాల పోటీల పైనే ఎక్కువగా దృష్టి పెట్టింది.ఒకవేళ మిస్ ఇండియా టైటిల్ గనుక సొంతం చేసుకుంటే బాలీవుడ్ లోను పాపులర్ నేమ్ గా మారడం ఖచ్చితం.

ఇప్పటికే ముంబైలో మూడు రోజుల పాటు ఆడిషన్స్ చేసిన శివాని పోటీకి పూర్తిగా సిద్ధమవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube