రూ.కోట్లు సంపాదించేందుకు సింపుల్ సూత్రం చెప్పిన ఎలాన్ మస్క్..!

కోట్లకొద్దీ డబ్బు సంపాదించాలంటే ధైర్యం, తెగువ, కష్టపడే తత్వం, తెలివి, కాస్త అదృష్టం ఉండాలి.ప్రపంచ అపరకుబేరుడైన ఎలాన్ మస్క్ లో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి.

 Elon Musk Has Come Up With A Simple Formula To Earn Crores Of Rupees Details, Si-TeluguStop.com

చిన్నతనం నుంచే కష్టపడుతూ తన మెదడుకి పని పెడుతూ మిలియన్ల కొద్దీ డాలర్లను సంపాదించారు మస్క్.ఆ తర్వాత ధైర్యం చేసి వ్యాపారాలను స్థాపించి ఇప్పుడు ఎవరు సంపాదించాలేనంత డబ్బు సంపాదించారు.

అయితే ఈ స్థాయిలో సంపదను సంపాదించిన మస్క్ వద్ద చాలా అనుభవం ఉంది.అందుకే ఇతని వద్ద ఆర్థిక పాఠాలు నేర్చుకునేందుకు కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ ద్వారా డబ్బు ఎలా సంపాదించాలో సింపుల్‌గా చెప్పేసారు మస్క్.ట్వీట్ ద్వారా మస్క్ చెప్పిన ఈ సింపుల్ సూత్రం ఇప్పుడు వైరల్ గా మారింది.

స్టాక్ మార్కెట్లో సంపాదన గురించి నన్ను చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను.ఏవైతే కంపెనీలు ప్రొడక్ట్స్ తయారు చేస్తాయో లేదా సర్వీసెస్ ఆఫర్ చేస్తాయో వాటిపై మీకు నమ్మకం ఉంటే ఇన్వెస్ట్ చేయండి.

ఈ కంపెనీలు చాలా వరస్ట్ గా మారుతున్నాయనే సంకేతాలు కనిపించినప్పుడు వెంటనే మీ స్టాక్స్ అమ్మేయండి.మిగతా సమయంలో సేల్ చేయకండి.అప్పుడప్పుడు మార్కెట్ ఒక్కసారిగా పైకి కిందకీ కదలాడుతుంది.అలాంటప్పుడు భయపడకండి.

ఫుల్ క్లారిటీ ఉంటేనే షేర్స్ అమ్మండి.అప్పుడే మీకు దీర్ఘకాలికంగా మంచి లాభాలు దక్కుతాయి” అని ఎలాన్ మస్క్ సింపుల్ గా చెప్పేశారు.చాలా మంది వ్యక్తులు స్టాక్ మార్కెట్ లో దిగి చాలా తక్కువ సమయంలో ఎక్కువ మనీ ఆర్జించాలని ఆశపడుతుంటారు.కానీ ఈ ధోరణి లాంగ్ టర్మ్ లో భారీ నష్టాలను మిగిల్చుతుంది.

అందుకే మస్క్ చెప్పిన సూత్రం ఫాలో అయితే కచ్చితంగా స్టాక్ మార్కెట్ ద్వారా కళ్లు చెదిరే లాభాలు పొందడం సాధ్యమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube