ఒక సినిమా మొదలు ఎండింగ్ వరకు అంటే ఆ సినిమా విడుదల అయ్యి ప్రేక్షకులకు రీచ్ అయ్యే వరకు ఆ సినిమాకి సంబందించిన ప్రతి విషయాన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆచి తూచి చేస్తుంటారు మన మూవీ మేకర్స్.అంతేకాదు ఆ సినిమా మన ఆడియన్స్ మనస్సులో గుర్తుండి పోవాలి అన్న అనుకున్నంత సక్సెస్ ను సాధించాలన్న కూడా సినిమాకి ముందు నుండే ప్రమోషన్స్ చాల అవసరం.
అయితే ఈ ప్రమోషన్స్ విషయంలో ఒక్కొక్కరు ఒక్కోలా ఆలోచిస్తుంటారు… దానిలో భాగంగానే ఒక్కొక్కరు సమ్ థింగ్ డిఫరెంట్ గా తమ సినిమాలను ప్రమోట్ చేస్తుంటారు.అందులో భాగంగానే ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇప్పుడు కామన్ అయిపోయాయి.
చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకూ అందరూ కూడా ఇదే ట్రెండ్ ను ఫాలో అవుతూ తమ సినిమాలకు ప్రొమోషన్స్ చేస్తున్నారు.
అయితే. అదే ఇంటర్వ్యూలు, అదే ఈవెంట్లు, అదే ప్రమోషన్లలో ఇప్పుడు కాస్త కొత్తగా ప్లాన్ చేస్తున్నారు మన మేకర్స్.అందులో భాగంగానే ఈవెంట్లతో యంగ్ హీరోలను యాంకర్లుగా మారుస్తూ.
అలాగే ఇక ఇంటర్వ్యూలలో దర్శకులను యాంక్టర్లుగా మారుస్తున్నారు.దీనికి చక్కటి ఉదాహరణ ఆ మధ్య రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో జాతి రత్నాలు హీరో అయినా నవీన్ పోలిశెట్టి యాంకరింగ్ చేసి తనదైన శైలిలో అదరగొట్టిన సంగతి తెలిసిందే.
అయితే ఈ వేడుక తర్వాత స్టార్ హీరోల సినిమా వేడుకలకు యంగ్ హీరోలతో యాంకరింగ్ చేస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ ఇప్పుడు మొదలైంది.

కాగా.ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ ఇంటర్వ్యూలలో అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో రాజమౌళిని ఇంటర్వ్యూ చేయగా, ఆ తర్వాత అనిల్ రావిపూడి యాంకర్ గా ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి లతో చేసిన ఇంటర్వ్యూ ఎంత హైలెట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇక తాజాగా ఆచార్య ప్రమోషన్ లో భాగంగా సాగిన ఇంటర్వ్యూలలో కూడా ఇదే తరహాలో దర్శకుడు హరీష్ శంకర్ యాంకర్ గా ఇద్దరు హీరోలతో పాటు ఆ సినిమా దర్శకుడు కొరటాల శివను కూడా ఇంటర్వ్యూ చేశారు.

ఈ ఇంటర్వ్యూ కూడా బాగానే హైలెట్ అయింది.ఇక ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.రాబోయే కాలంలో కూడా ఇలానే ఒకరి సినిమాలకు మరొక హీరోలు, అలాగే దర్శకులే యాంకర్లుగా సినిమాల ప్రమోషన్ల మోత మోగించేలా కనిపిస్తుంది.ఇది ఇలానే కొనసాగితే మరి మన యాంకర్ల పరిస్థితి ఏమవుతుందో చూడాల్సి ఉంది.
మరి ఈ విషయాలపైనా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.








