కార్మిక వర్గం సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి:సిఐటియు పిలుపు

కార్మిక వర్గం సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు తప్ప మరో మార్గం లేదని మే డే స్పూర్తితో ఐక్య పోరాటాలు ఉదృతం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు.

 The Working Class Must Be Prepared For Militant Struggles For The Solution Of Pr-TeluguStop.com

స్థానిక ఖమ్మం అర్బన్ తహసిల్దార్ కార్యాలయం ముందు సిఐటియు ఖమ్మం త్రీ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో కార్మిక సమస్యలపై ధర్నా నిర్వహించడం జరిగింది.

భూక్య శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో కళ్యాణ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ ఈరోజు కార్మిక వర్గానికి ప్రభుత్వ పథకాలలో ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి అమలు చేయాలని, హమాలీలకు సమగ్ర సంక్షేమ చట్టం ఏర్పాటు చేయాలని, నిత్యావసర సరుకుల ధరలు పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని, కార్మికులందరికీ పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, నివాస ప్రాంతాలలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని, శ్రామిక మహిళా కార్మికులకు పని ప్రదేశాలలో ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని, ఖమ్మం కేంద్రంలో ఈ ఎస్ ఐ హాస్పిటల్ కట్టించాలని, అర్హులందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంటి స్థలం ఉన్న వారికి 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలని, కార్మిక చట్టాలు సవరణలు ఆపాలని సమస్యల పరిష్కారానికి పోరాటాలు తప్ప మరో మార్గం లేదని ఐక్య పోరాటాలు ద్వారా సమస్యలను సాధించగలమని పిలుపునిచ్చారు.

సి ఐ టి యు రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ మాట్లాడుతూ నేడు అత్యంత ఉన్నటువంటి కార్మిక వర్గానికి ప్రభుత్వాలు పథకాలు అందించడంలో పూర్తిగా విఫలమవుతోంద అన్నారు.

ప్రభుత్వాలు విధించే భారాలలు మొట్టమొదట కార్మికవర్గం పైనే పడుతున్నాయని ఈ భారాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సిఐటియు నిర్వహించిన సర్వేలలో వచ్చిన అనేక సమస్యల పరిష్కారానికి భవిష్యత్తులో దశలవారీ ఆందోళనలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.ళ అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తాసిల్దార్ యం.శైలజా అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో టి యు డి ఎఫ్ రాష్ట్ర నాయకులు యర్రా శ్రీనివాస రావు, సి ఐ టి యు జిల్లా అధ్యక్షులు టి.విష్ణు, ఉపాధ్యక్షులు తుశాకుల లింగయ్య, నాయకులు పాశం సత్యనారాయణ, వేల్పుల నాగేశ్వర రావు, ఎస్ కే సైదులు, మద్ది సత్యం, కొట్టే అలివేలు, డివైఎఫ్ఐ నాయకులు శీలం వీరబాబు, నాయకులు మండల వీర స్వామి, మీనాల మల్లికార్జున్, పేరయ్య, బుజ్జి, బొబ్బిల నాగరాజు, వెంకన్న, కోడి వెంకన్న, బుగ్గ శ్రీశైలం, దొడికె కృష్ణ, వెంకన్న, నాయిని నరసింహా రావు, రంగు హనుమంత చారి, సాయిలు, గబ్బెటి పుల్లయ్య, పావురాల నాగేశ్వరావు, నగేష్, తమ్మినేని రంగారావు తదితరులు పాల్గొన్నారు.

*సిఐటియు ఖమ్మం త్రీ టౌన్ కమిటి*

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube