ఆచార్య సినిమాలో పూజ హెగ్డే పాత్ర కోసం ముందుగా ఎవరిని అనుకున్నారో తెలుసా ?

ఆచార్య సినిమా చూసిన మెగా అభిమానులు దర్శకుడు కొరటాలను బుల్లెట్ లాంటి మాటలతో వెంటాడుతున్నారు.మెగాస్టార్ మూవీ అనే ఓ రేంజ్ లో ఎక్సపెక్టేషన్స్ ఉంటాయి.

 Pooja Hedge Is Not First Choice Of Acharya Keerthy Suresh Details, Pooja Hegde,-TeluguStop.com

అందులోనూ ఇది మల్టీ స్టారర్ మూవీ మరియు తండ్రి కొడుకులు కలిసి మొదటి సారిగా నటిస్తున్న మూవీ.చిరు రేంజ్ తెలియంది కాదు, చెర్రీ జోరు ఆగేది కాదు మరి ఇద్దరు మెగా హీరోలు కలిసి నటిస్తున్న చిత్రం అంటే ఆ మాత్రం అద్భుతాన్ని ఆశిస్తారు అభిమానులు.

కానీ ఆఫ్టర్ రిలీజ్ మొత్తానికే మోసం వచ్చింది, కనీసం మూవీకి యావరేజ్ టాక్ కూడా రాకపోవడంతో మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికపై కొరటాలపై కామెంట్ల బాణాలు సరిగ్గా గురి చూసి మరి విసురుతున్నారు.ఇంత వరకు ఓటమి లేదని అనుకోవడం కాదు ఇద్దరు మెగా స్టార్స్ ను చూపించేటపుడు కనీస మార్క్ ను కనబరచకపోతే ఎలా అంటూ తిట్టిపోస్తున్నారు.

అసలు చిరు ఎంట్రీ ఎలా ఉండాలి, చెర్రీ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సీన్ ఏ రేంజ్ లో ఉండాలి.కనీసం ఓ డెబ్యూ హీరోకి ఉండే స్థాయిలో కూడా లేకపోవడం ఏంటి అంటున్నారు.

ఏదో మధ్యలో థియేటర్ లో ప్రేక్షకుల్ని నిద్రలేపడం కోసం అన్నట్లుగా ఇంట్రవెల్ తరవాత చిరు, చెర్రీలు కలిసి మైనింగ్ దగ్గర ఫైట్ విత్ ఫన్ అన్నట్లుగా ఆ ఒక్క సీన్ లో కాస్త ఊపు తెప్పించి మళ్ళీ నెమ్మదిగా డౌన్ చేసేసారు.అసలు ఆ కథ ఏంటి ? ఏమైనా తల, తోక ఉందా అంటూ విరుచుకు పడుతున్నారు.

Telugu Acharya Flop, Acharya, Koratala Shiva, Keerthy Suresh, Kajal Aggarwal, Ke

మా చిరుకి వినిపించిన కథ ఒకటి మీరు స్క్రీన్ పై ప్రెజెంట్ చేసింది మరొకటి అంటూ మండిపడుతున్నారు.ఈ మాటల యుద్ధం ఇప్పట్లో తగ్గేలా లేదు.ఇక ఈ సినిమా ఆశించిన స్థాయిలో లేకపోవడం వెనుక కొరటాల చేసిన కొన్ని పొరపాట్లు ఉన్నాయి అంటూ వార్తలు వినపడుతున్నాయి.

ముందుగా మెగాస్టార్ కోసం కొరటాల అనుకున్న లైన్ వేరట, అయితే చెర్రీ పాత్రను మధ్యలో పొడిగించి కథను కొద్దిగా మార్చారట.

అంతేకాదు ముందుగా చెర్రీకి హీరోయిన్ గా కీర్తి సురేష్ ని అనుకున్నారట, సంప్రదింపులు కూడా జరిగాయట అయితే కీర్తికి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో నీలాంబరి పాత్రకు పూజ హెగ్డే ను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Telugu Acharya Flop, Acharya, Koratala Shiva, Keerthy Suresh, Kajal Aggarwal, Ke

అదే కనుక ముందుగా అనుకున్నట్లు కీర్తిని కనుక ఆ పాత్రలో నటింప చేయించి ఉండి ఉంటే కొంచం ఇంట్రెస్టింగ్ గా ఉండేది, ఇది కూడా ఒక పెద్ద మైనస్.అలాగే చెర్రీ పాత్రను అలా మధ్యలో చంపేయడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.కథలో కొద్దిగా మార్పు, కాస్త స్పీడు, చెర్రీకి హీరోయిన్ గా కీర్తి సురేష్, చిరు పక్కన కాజల్ ఉంది ఉంటే మూవీ వేరే రేంజ్ లో ఉండేదని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube