బడికి దూరం చేసిన కరోనా

యాదాద్రి జిల్లా:కరోనా కాలంలో బడికి దూరమైన పిల్లలను గుర్తించి వారిని బడిలో చేర్పించి,వారికి నాణ్యమైన విద్య అందించాలని విద్యా ఉద్యమం రాష్ట్ర నాయకులు ఎర్ర శివరాజ్ కోరారు.శనివారం భువనగిరి జిల్లా కేంద్రంలోని ఖిల్లా వద్ద జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడాతూ కరోనా కాలంలో బడులను మూసివేయడంతో కొందరు పిల్లలు బాల కార్మికులుగా మారిపోయారని,ఆడ పిల్లలకు పెంళ్లిళ్ళు జరిగాయన ఆయన అన్నారు.

 Corona Away From Bondage-TeluguStop.com

కరోనా కారణంగా పిల్లల్ని పై తరగతులకు ప్రమోట్ చేయడంతో,వారిలో విద్యా సామర్థ్యం తగ్గిపోయిందన్నారు.మరొక వైపు రాష్ట్రంలో 577 మండల విద్యాశాఖాధికారుల పోస్టులు,21 జిల్లాలో విద్యా శాఖాధికారుల ఖాళీలు ఉండడంతో నాణ్యమైన విద్య అందడంలేదని ఆయన అన్నారు.

రాష్ట్ర బడ్జెట్ లో 20 శాతం నిధులను విద్యకు కేటాయించాలని విద్యా ఉద్యమం డిమాండ్ చేస్తుందన్నారు.కరోనా తర్వాత రాష్ట్రంలోని 323 బడులలో విద్యార్ధుల హాజరుశాతం పరిశీలించగా 26.4% విద్యార్ధులు బడికి బయట ఉన్నారని తెలిసిందన్నారు.323 పాఠశాలల్లో 44,071 మంది పిల్లలు హాజరు రిజిష్టర్ లో నమోదు కాగా వారిలో కేవలం 32,418 మంది మాత్రమే హాజరగుతున్నారని,11,653 మంది విద్యార్ధులు బడికి రావడం లేదన్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా విద్యా ఉద్యమం జనరల్ సెక్రట్రీ కొడారి వెంకటేష్ మాట్లడుతూ జిల్లాలో మొత్తం 712 ప్రభుత్వ పాఠశాలలుండగా కేవలం 215 పాఠశాలలను మనఊరు-మనబస్తీ-మనబడి పథకంలో గుర్తించడం సరి కాదన్నారు.మిగిలిన 497 బడులను కూడా అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల పీజుల దోపిడి అధికంగా ఉందని,ప్రతి ఏటా 20-30 శాతం పీజులను పెంచుతున్నాయని,దీంతో తల్లిదండ్రులు ఇబ్బందులకు గురగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.తమిళనాడు,మహారాష్ట్ర,ఢిల్లీ,రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల మాదిరిగా పీజుల నియంత్రణ చట్టం” రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కరోనా సమయంలో సగం పీజు మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా,అది అమలు జరగడం లేదన్నారు.ప్రైవేటు పాఠశాలల్లో పీజులను పెంచుటకు ఆయా విద్యా సంస్థలు,పేరేంట్స్ కమిటీ ఆధ్వర్యంలో నిర్ణయం జరగాలని సూచించారు.

ఎల్కేజి మరియు యూకేజి పిల్లల పీజు రూ 12,500 మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినా,అందుకు విరుద్దంగా 20 వేల నుండి 50 వేల వరకు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు.ఒక్క హైదరాబాద్ నగరంలో ఏటా 10 వేల కోట్ల విద్యా వ్యాపారం జరుగుతుందన్నారు.

జంట నగరాల్లో చైనా కు చెందిన 20 కళాశాలకు ఎలాంటి అనుమతులు లేకున్నా తరగతులు నిర్వహిస్తూ కోట్లు గడిస్తున్నారన్నారు.ఈ పత్రికా విలేఖరులు సమావేశంలో విద్యా ఉద్యమం యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ బొక్క రాంబాయి,వైస్ చైర్మన్ ఆవుల వినోద్ కుమార్,సురుపంగ శివలింగం,జనరల్ సెక్రట్రీ కొడారి వెంకటేష్,మెంబర్స్ నలమాసు కుమార్, ముడుగుల శంకర్,హీరాలాల్,చెరుకు బాలరాజు, సోమనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube