తన యూజర్లకోసం టెలికాం దిగ్గజం Airtel 2 కొత్త బ్రాడ్ బ్యాండ్లను ప్రవేశపెట్టింది.తద్వారా ఈ 2 బ్రాడ్ బ్యాండ్లపై ఉచితంగా OTT స్ట్రీమింగ్ నెట్ ఫ్లిక్స్ కంటెంట్ యాక్సస్ చేసుకునేందుకు అనుమతినిస్తుంది.
ఆ ప్లాన్స్ లో ఒకటి ఎయిర్‌టెల్ ప్రొఫెషనల్ ప్లాన్, రెండు ఇన్ఫినిటీ ప్లాన్.ఈ 2 ప్లాన్లతో ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ అందిస్తోంది.ఇక ఎయిర్‌టెల్ ప్రొఫెషనల్ ప్లాన్ కోసం నెలకు రూ.1,498 చెల్లించాల్సి రాగా, ఇన్ఫినిటీ ప్లాన్ కొరకు నెలకు రూ.3,999 చెల్లించాల్సి ఉంటుంది.ఇకపోతే Airtel ప్రొఫెషనల్ ప్లాన్‌ను కొనుగోలు చేసే యూజర్లు నెలకు రూ.199తో Netflix బేసిక్ ప్లాన్ యాక్సెస్ చేసుకోవచ్చు.Airtel ఇన్ఫినిటీ ప్లాన్‌ని ఎంచుకునే యూజర్లు నెలవారీ నెట్‌ఫ్లిక్స్ ప్రీమియం ప్లాన్ యాక్సెస్ చేసుకోవచ్చు.
ఇండియన్ OTT మార్కెట్లో నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్, బేసిక్ ప్లాన్, స్టాండర్డ్ ప్రీమియం ప్లాన్‌తో సహా మొత్తం 4 ప్లాన్‌లను ఎయిర్ టెల్ ఇపుడు అందించడం కొసమెరుపు.మొబైల్ ప్లాన్ ఒక స్క్రీన్ సపోర్ట్‌తో నెలకు రూ.149 చెల్లించాలి.అదే ప్రైమరీ ప్లాన్ కోసమైతే రూ.199 ప్లాన్ కూడా ఒక స్ర్కీన్ వరకు యాక్సస్ చేసుకొనే వెసులుబాటు కలదు.ఇపుడు Airtel బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో Netflixని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ముందుగా Airtel Thanks యాప్‌లోని ‘Discover Thanks Benefit’ పేజీకి వెళ్ళాలి.తరువాత క్రిందికి స్క్రోల్ చేసి.
‘Enjoy your rewards’ సెక్షన్లో ‘Netflix’ని ఎంచుకోవాలి.దాని తరువాత ‘Claim’ని ఎంచుకొని, Proceed’పై క్లిక్ చేసిన తరువాత Netflix ప్రొడక్ట్ వివరణ పేజీలో ఆప్షన్ ని ఎంచుకోవడం ద్వారా యాక్టివేషన్‌ను పూర్తి చేసేందుకు కస్టమర్ నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అవుతారు.

ఇక టెలికాం ఆపరేటర్ ఇటీవలే రూ.1199, రూ.1599 విలువైన 2 ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్‌లతో ముందుకు వచ్చింది.ఈ క్రమంలో ఉచిత నెట్‌ఫ్లిక్స్ స్టాండర్డ్ ప్లాన్‌ను ప్రకటించింది.దీనికి అదనంగా రూ.1599 ప్లాన్ ఉచిత అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తుంది.500GB వరకు డేటా, అన్‌లిమిటెడ్ పొందవచ్చు.Disney+ Hotstar, Airtel Xtremeకి సబ్‌స్క్రిప్షన్, అన్ లిమిటెడ్ కాల్స్, హ్యాండ్‌సెట్ ప్రొటెక్షన్, ఫ్రీ యాడ్-ఆన్ కనెక్షన్ వంటి మరెన్నో ఆఫర్లను ఉచితంగా పొందవచ్చు.







