కరోనా రక్కసి యావత్ ప్రపంచ మానవ జీవన విధానంలో పెను మార్పులనే తెచ్చింది.ఈ క్రమంలో ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమం కోసం చాలా సంస్థలు వర్క్ ప్రమ్ హోమ్ విధానాన్ని ప్రవేశపెట్టి, ఇంకా కొనసాగిస్తున్నాయి.
ఇక కొన్ని సంస్థలైతే ఆఫీసులు తెరిచి కొంతమంది ఉద్యోగులను మాత్రమే తమ కార్యాలయాలకు పిలుస్తోంది.ఈ నేపథ్యంలో US చెందిన ఓ సంస్థ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.
సంస్థ ప్రయోజనాల నిమిత్తం ప్రపంచంలోని ఏమూల నుంచైనా పని చేసుకునే Work From Any Where స్వేచ్ఛను కల్పించింది.కొంతమంది సిబ్బంది మాత్రమే ఆఫీసుకు వస్తే సరిపోతుందని స్పష్టం చేసింది.
ఇంతకీ ఎక్కడంటే, San Francisco వేదికగా పనిచేసే Airbnb అనే సంస్థ ఈ వెసులుబాటుని తమ ఉద్యోగుల కోసం ప్రకటించింది.ఇక ఈ పని విధానంలో ఉద్యోగుల వేతనాలపై ఎలాంటి ప్రభావం ఉండదని కంపెనీ చెప్పడం హర్షించదగ్గ విషయం.
కేవలం మరికొద్ది నెలల్లోనే ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు సంస్థ CEO ‘బ్రియాన్ చెస్కీ‘ తమ ఉద్యోగులందరికి ఈ తాజా శుభవార్తని పంపారు.దాంతో సదరు సంస్థ ఉద్యోగులు పండగ చేసుకుంటున్నారు.
అయితే విదేశాల్లో పనిచేయాలనుకునే వారికి మాత్రం కొన్ని షరతులు, నిబంధనలు విధించారు ఈ CEO.
ఆ షరతులేమంటే.ఉద్యోగులు ఎక్కడినుంచైతే ఫీస్ ఫుల్ గా పని చేస్తారో, అధిక ఉత్పాదకత రాబట్టగలరో అక్కడి నుంచే పని చేసేందుకు సంస్థ వెసులుబాటును కల్పించింది.అలాగే ఉద్యోగులు దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా మరో ప్రాంతానికి ఈ క్రమంలో వారి పర్సనల్ అవసరాల నిమిత్తం మారిపోవచ్చు.
కుటుంబానికి దగ్గరగానైనా, లేదా కోరుకున్న మరో ప్రాంతానికైనా. శాలరీల విషయంలో ఎలాంటి నిబంధనలు లేవు.ఎప్పటిలాగే వారి ఫుల్ శాలరీ వచ్చేస్తుంది.జూన్ నుంచి జీతం, ఈక్విటీ రెండింటికీ ఒకే తరహాలో చెల్లింపులు జరుగుతాయి.
సెప్టెంబర్ నుంచి ఉద్యోగులు 170 దేశాల్లోని ఏ ప్రాంతం నుంచైనా పనిచేసుకోవచ్చు.అయతే పన్నులు తదితర కారణాల వల్ల 90 రోజులు ఒకే ప్రాంతంలో ఉండాల్సి ఉంటుంది.