తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ రియాల్టీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ నాన్ స్టాప్ ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే.
ఫినాలే దగ్గరపడుతున్న కొద్దీ బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ ల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్టుగా నడుస్తోంది.మొదట 17 మంది కంటెస్టెంట్ లతో ఈ షోలో ప్రస్తుతం తొమ్మిది మంది కంటెస్టెంట్ లు మాత్రమే మిగిలారు.
ఇకపోతే బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ మే 21, 22,23 తేదీలలో నిర్వహించాలని బిగ్ బాస్ మేకర్స్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.అయితే బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున కొన్ని కార్యక్రమాల వల్ల బిజీగా ఉండడంతో ఫినాలే ఎపిసోడ్ కి అందుబాటులో ఉండడు అని తెలుస్తోంది.
అయితే ఫినాలే ఎపిసోడ్ కి నాగార్జున బదులుగా హీరో నానిని సంప్రదించగా, నాని కూడా ఏవో కారణాల వల్ల నో చెప్పాడట.ఒకవేళ నాగార్జున తోనే ఫైనల్ నిర్వహించాల్సి వస్తే బిగ్ బాస్ షోని మరొక వారం ఎక్స్ టెండ్ చేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
లేకపోతే ఫినాలే ఎపిసోడ్ లో బాలకృష్ణ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని తెలుస్తోంది.నాగార్జునకు కుదరని నేపథ్యంలో బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫినాలే ఎపిసోడ్ కి బాలకృష్ణ వస్తాడు అని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఆ హలో అన్ స్థాపబుల్ షోలో పోస్ట్ గా అదరగొట్టిన బాలయ్య, బిగ్ బాస్ లో కూడా హోస్ట్ గా అదరగొట్టడం ఖాయం అనడం లో ఎటువంటి సందేహం లేదు.

అయితే ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.ప్రస్తుతానికి ఇది ఒక ప్రచారం మాత్రమే కాగా బాలయ్య బిగ్ బాస్ హౌస్ లో మెరుస్తాడా లేదా అన్నది చూడాలి మరి.అలాగె బిగ్ బాస్ షోని బాబాలయ్య కు అప్పగిస్తే హోస్టింగ్, ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్ లో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో ఇదే విషయంపై మరొక వార్త కూడా వినిపిస్తోంది.నాగార్జున గత మూడు సీజన్ లుగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.కాబట్టి ఈసారి సరికొత్తగా బాలయ్య బాబు ని రంగంలోకి దింపే ప్రయత్నం లో బిగ్ బాస్ షో నిర్వాహకులు ఉన్నట్లు తెలుస్తోంది.అంతేకాకుండా బిగ్ బాస్ సీజన్ 6 ని బాలయ్యతో నిర్వహించాలి అనుకుంటున్నట్లు తెలుస్తోంది.







