సర్కారు వారి పాట పోకిరిని మించి హిట్ అవుతుంది.. ఎడిటర్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇటీవలే పూర్తి అయిన విషయం తెలిసిందే.

 Sarkaru Vari Paata Movie Editor Marthand K Venkatesh Special Interview Details,-TeluguStop.com

త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.దర్శకుడు పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

మైత్రి మూవీ మేకర్స్,జీఏంబీ ఎంటర్టైన్మెంట్స్,14 రీల్స్ ప్లస్ బ్యానర్ లపై నవీన్ యెర్నెని, వై రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరించారు.ఇకపోతే ఈ సినిమా మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

అయితే విడుదల తేదీకి మరి కొన్ని రోజుల సమయం ఉండటంతో ఈ చిత్రం ప్రమోషన్స్ ను మొదలుపెట్టేసింది.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు పనిచేసిన స్టార్ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ మీడియాతో మాట్లాడి సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.ఈ సందర్భంగా ఎడిటర్ మాట్లాడుతూ.

దర్శకుడు పరశురామ్ గారి సినిమాలు ఫ్యామిలీ డ్రామా, ఫీల్ గుడ్ లవ్ స్టొరీ ఎలా ఉంటాయి.కానీ సర్కారు వారి పాట సినిమాలో హై వోల్టేజ్ మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్నాయి అని తెలిపారు.

గీత గోవిందం, పోకిరి సినిమాలు నేను ఎడిట్ చేశాను ఈ రెండు సినిమాలు కలిపితే ఎలా ఉంటుందో ఆ విధంగా సర్కారీ వారి పాత సినిమా ఉంటుంది అని చెప్పుకొచ్చారు.పోకిరి సినిమాకు మించి ఈ సర్కారు వారి పాట సినిమా హిట్ అవుతుంది అని తెలిపారు.

ఇందులో మంచి ఫిల్ ఉంటుందని, అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా మెసేజ్ లు ఉంటుంది అని తెలిపారు.

Telugu Parashuram, Mahesh Babu, Pokiri, Sarkaruvaari, Tollywood-Movie

అదేవిధంగా హీరో మహేష్ బాబు కూడా ఈ సినిమాలో చాలా అందంగా ఉంటారు అని తెలిపారు.అదే విధంగా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది అని ఎడిటర్ తెలిపారు.ఇందులో ఫస్ట్ హాఫ్ అంతా యూత్ ఫుల్ గా, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ ఎమోషన్, యాక్షన్ తో అదిరిపోతుంది అని చెప్పుకొచ్చారు.

అయితే సర్కారు వారి పాట సినిమా ను పోకిరి సినిమాతో పోటీ చేయడానికి కారణం.నేను పోకిరి సినిమా కు ఎడిటర్ గా పని చేశాను అందువల్లే పోకిరి సినిమాతో సర్కారు వారి పాట సినిమాని పోల్చాను అని తెలిపారు.మొత్తానికి ఎడిటర్ మాటలను బట్టి చూస్తే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోబోతోంది అని తెలుస్తోంది.2006లో విడుదలైన పోకిరి సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube