గార్లఒడ్డులో అక్రమ రేషన్ దందా..పట్టిస్తే పోలీస్ బెదిరింపులు:- బాధితుడు కాకాని అభిలాష్

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం గార్లఒడ్డు గ్రామంలో కొన్నేళ్లుగా ప్రభుత్వం పేద ప్రజలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతుందని, సంబంధిత రెవెన్యూ అధికారి కూడా అందుబాటులో ఉండకపోవడంతో ఈ అక్రమ రేషన్ దందాదారులు స్థానిక పోలీస్ అధికారులను మచ్చిక చేసుకొని లోడ్లకు లోడ్లు అక్రమంగా పంపుతూ జోరుగా వ్యాపారం కొనసాగిస్తూ ఎవరైనా ఫిర్యాదు చేస్తే బెదిరింపులు, దాడులకు పాల్పడుతున్నారని అదే గార్లఒడ్డు గ్రామానికి చెందిన కాకాని అభిలాష్ ఆరోపించాడు.శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో అభిలాష్ మాట్లాడుతూ.

 Police Threats Against Illegal Rations In Garloddu: - The Victim Is Not Abhilash-TeluguStop.com

ఏప్రిల్ 12 మంగళవారం అర్ధరాత్రి గార్లఒడ్డు గ్రామంలో మా ఇంటిపక్క నుండి టాటా ఏసీ, బొలెరో వాహనాలు తిరుగుతుంటే వాటి వెంట వెళ్లి అక్కడ జరుగుతున్న రేషన్ బియ్యం లోడింగ్ చూసి 100కు డయల్ చేసి చెప్పాను.గతంలో కూడా వాహనాలు బాగా తిరిగేవి అప్పుడు నాకు తెలియదు.

ఇప్పుడు కల్లూరు ఏసీపికి వెంటనే ఫోన్ ద్వారా సమాచారం అందించాను.వారు రావడం లేటవుతుందని నేనే నేరుగా ఏన్కూరు పోలీస్ స్టేషన్ కు బయలుదేరాను.

అది తెలిసిన కూరాకుల రమేష్ తన అనుచరులతో కారుతో వెంబడించి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టారు.క్రిందపడ్డ నేను భయంతో పక్కనే ఉన్న సాయి టాగూర్ ఫంక్షన్ హాల్ లో దాక్కున్నాను.

అక్కడ నుండి ప్రాణభయంతో మరల ఏసిపికి ఫోన్ చేసి చెప్పాను.వెంటనే ఏన్కూరు ఎస్ఐ నుండి ఫోన్ వచ్చింది.

తదుపరి వెంటనే పోలీసులు నుండి సమాచారం తెలుసుకున్న రేషన్ దందాదారులు కూరాకుల రమేష్ తన అనుచరులతో వచ్చి నీవు పోలీసులకు చెబితే నాకు తెలియదా.అంటూ దాడిచేశారు.

నా ఫోన్ లాకున్నారు.అంతలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం వచ్చేసరికి నేను వారిని తప్పించుకొని పోలీసులకు వెళ్లి చెప్పాను.

అప్పటికీ దుండగుల కారు నా ద్విచక్ర వాహనం అక్కడే ఉన్నాయి.పోలీసులు రేషన్ కాడికి వెల్దామని తీసుకెళ్లారు.

దుండగులు తప్పించుకున్నారు.నేను రేషన్ బియ్యాన్ని చూపించితే ట్రాక్టర్ ద్వారా స్టేషన్ కు తరలించారు.

నాతోనే 40బస్తాల బియ్యాన్ని ట్రాక్టర్ లోకి మోపించారని తెలిపాడు.మరుసటిరోజు అక్రమ రేషన్ దందాదారులు, దాడిచేసిన వారు కూరాకుల రమేష్ ఒక్కల్లే కావడంతో ఫిర్యాదు చేశాను.

నా పిర్యాదుపై కేసునమోదు చేయకుండా.నేను పట్టించిన బియ్యాన్ని ఎస్సై అనుమానిత బియ్యంగా పత్రికా ప్రకటన చేయడం దారుణమని.

అక్రమ వ్యాపారులనుండి ఎంత అమ్యామ్యాలకు పాల్పడుతుండో దీన్ని బట్టి అర్ధమవుతుందని పేర్కొన్నారు.అర్ధరాత్రి 2గంటల సమయంలో నేను పట్టించిన 40బ్యాగుల రేషన్ బియ్యాన్ని ట్రాక్టర్ నుండి నాతోనే పోలీసులు మోపించారని ఆవేదన వ్యక్తంచేశాడు.

ఈ అక్రమ రేషన్ దందా వెనుక ఓ చోటా నాయుడు ఉండి నడిపిస్తున్నాడని ఆయనే ఈ దాడులకు, పోలీసుల బెదిరింపులకు కారణమని ఆరోపించాడు.ఈ కేసును రద్దు చేసినట్టు ఎస్సై ప్రకటించడం శోచనీయమన్నారు.

దీనిపై ఎంతటి న్యాయ పోరాటమైన చేస్తానని తెలిపాడు.లోకాయుక్త, మానవహక్కుల కమీషన్, ఖమ్మం పోలీస్ కమీషనర్ కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి అక్రమ రేషన్ వ్యాపారాన్ని అరికట్టి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube