ఈ రోజుల్లో బియ్యం, నూనెలు నుంచి పప్పుల ధరలకు వరకు అన్ని ధరలు పెరిగిపోతున్నాయి.ముఖ్యంగా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో సరైన సమయం నుంచి అన్ని ధరలు పెరుగుతున్నాయి.
చమురు ధరలు, ఆయిల్ ధరలు ఇలా ఒకటేంటి చాలా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.అయితే కొందరు వ్యాపారులు యుద్ధం, పెరిగిన డీజిల్ ధరలను కారణంగా చూపుతూ ధరలను భారీగా పెంచేస్తున్నారు.
ఇక బ్లాక్ మార్కెటింగ్ దందా కూడా నడుస్తోంది.మళ్లీ ఇప్పుడు ఇండియాలో ఎండాకాలం కావడంతో కొన్ని కూరగాయలు, పండ్లు, పాల రేట్లు బాగా పెరుగుతున్నాయి.
దీంతో పేద, మధ్యతరగతి ప్రజల మంత్లీ ఫ్యామిలీ మెయింటినెన్స్ ఖర్చు 25 శాతం నుంచి 50 శాతం వరకు పెరిగిపోయింది.
చమురు పెరగడం వల్ల రవాణా ఛార్జీల పెరిగాయని వ్యాపారులు పప్పు దినుసుల ధరలు కేజీకి రూ.10 నుంచి రూ.30 వరకు పెంచుతున్నారు.కొద్ది రోజుల క్రితం కేజీ కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు రూ.100గా ఉండేవి.కానీ ఇప్పుడు అవి కేజీకి రూ.110 నుంచి రూ.130కి ధర పలుకుతున్నాయి.ఇక రిటైలర్లు వీటిని మరింత ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు.మినప్పప్పు హోల్‌సేల్‌లో రూ.90 ఉంటే తెలుగు రాష్ట్రాల్లోని రిటైలర్లు కేజీ మినప్పప్పుని రూ.130గా సేల్ చేస్తున్నారు.
నెల రోజుల క్రితం రూ.100-110గా ఉండే పల్లీల ధర ఇప్పుడు రిటైల్ మార్కెట్‌లో రూ.140కి ఎగబాకింది.చివరకు పులిహోరలో ప్రధాన పదార్థమైన చింతపండు కూడా రూ.140 నుంచి రూ.180 వరకు పెరిగిపోయింది.పప్పు తో పాటు ఇక ఉప్పు ధర కూడా రెట్టిపయింది.అన్ని నిత్యావసరాల ధరలతో దాదాపు 30 శాతం పెరగగా అగ్గిపెట్టె ధర కూడా రూ.2 అవ్వడంతో సామాన్యుడి నెత్తిన పిడుగు పడినంత పనవుతుంది.







