అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో అమెజాన్ ప్రైమ్ ద్వారా నాగ చైతన్య దూత అనే వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే అమెజాన్ రెండు సంవత్సరాలలో తమ సంస్థ నుంచి రాబోతున్న ఒరిజినల్ వెబ్ సిరీస్ లను ప్రకటించడం కోసం ఒక వేడుకను నిర్వహించారు.
ఇక ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగచైతన్య తన దూత వెబ్ సిరీస్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ తాను వెబ్ సిరీస్ లో నటించడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు.
ఇది పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకులను సందడి చేసే అవకాశం ఉందని నాగచైతన్య ఈ సందర్భంగా తెలియజేశారు.

ఓటీటీ ఎంట్రీ గురించి నాగచైతన్య మాట్లాడుతూ తమ పెర్ఫామెన్స్ ఎక్కువ మందికి చేరాలని నటులంతా భావిస్తారని, ఓటీటీల వల్లే అది సాధ్యమవుతుంది అందుకే చాలామంది నటీనటులు ఓటీటీలో నటించడానికి ఆసక్తి చూపుతారని నాగచైతన్య తెలియజేశారు ఇక తన దూత వెబ్ సిరీస్ గురించి మాట్లాడుతూ…నిజానికి తనకు హర్రర్ సినిమాలు అంటే చాలా భయం కానీ దానిని ఒక సవాల్ గా స్వీకరించి ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్నానని చైతన్య ఈ సందర్భంగా వెబ్ సిరీస్ గురించి తెలియజేశారు







