సామ్ బర్త్ డే కు మెగా హీరో ఇంట్రెస్టింగ్ పోస్ట్.. మాయచేసావ్ అంటూ..

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఈ రోజు పుట్టిన రోజును జరుపు కుంటుంది.దీంతో ఈమెకు అభిమానులు, సినీ సెలెబ్రిటీలు వరుసగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

 Mega Hero Sai Dharam Tej Interesting Post On Sam, Happy Birthday Samantha, Hbd S-TeluguStop.com

సోషల్ మీడియాలో ఈ రోజు సామ్ పుట్టిన రోజు సందడి కనిపిస్తుంది.ఈమె ప్రెసెంట్ టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది.

విడాకుల తర్వాత పడి లేచిన కెరటంగా వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్ లో దూసుకు పోతుంది.

ఒకవైపు సినిమాలు చేస్తూ మరో వైపు వరుస వెకేషన్స్ కు వెళ్తూ క్షణం కూడా కాళీ లేకుండా బిజీ బిజీగా గడిపేస్తుంది.

తెలుగు, తమిళం, హిందీ అనే తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది.ఇక ఈమె పుట్టిన రోజు సందర్భంగా సినీ ప్రముఖులు వరుసగా విషెష్ చెబుతున్నారు.

ఈ క్రమంలోనే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా సామ్ కు స్పెషల్ విషెష్ తెలిపాడు.

సాయి ధరమ్ తేజ్ మొదటి నుండి కూడా సమంత కు పెద్ద ఫాన్ అంటూ చెబుతూనే ఉన్నాడు.

మరి ఆ అభిమానాన్ని ఈ రోజు సోషల్ మీడియా వేదికగా నిరూపించుకున్నాడు.ఈ రోజు పుట్టిన రోజు జరుపు కుంటున్న సమంత కు సాయి తేజ్ స్పెషల్ నోట్ రాసి మరి విషెష్ తెలిపాడు.

ఈ మెగా హీరో చేసిన ఈ పోస్ట్ సోషల్ మాధ్యమాల్లో ఆకట్టు కుంటుంది.

ఈయన సమంత కు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ. జెస్సీ నువ్వు ఏమాయ చేసావో కానీ.ఏటో వెళ్లి పోయింది నా మనసు.హ్యాపీ బర్త్ డే సామ్.నిన్ను అమితంగా ఇష్టపడే వీరాభిమాని” అంటూ ఆయన స్పెషల్ గా సమంత సినిమాలతో విషెష్ చెప్పడం అందరిని ఆకట్టు కుంటుంది.ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ కూడా వరుసగా విషెష్ చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube