శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చే వారం ప్రోమో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.గత మూడు నాలుగు వారాల మాదిరిగానే ఈ వారంలో కూడా హైపర్ ఆది కనిపించడం లేదు.
గత నెల రోజులుగా ఇదే విషయమై ఈ టీవీ ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.హైపర్ ఆది ఎటు వెళ్ళాడు.
ఎక్కడ ఉన్నాడు అనే చర్చ తీవ్ర స్థాయిలో జరుగుతుంది.ఈ సమయంలో వచ్చే వారంకు సంబంధించిన శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ లో కూడా హైపర్ ఆది లేకపోవడంతో.
కన్ఫామ్ ఇక ఆయన ఈటీవీలో కనిపించడు అంటూ ప్రేక్షకుల అభిప్రాయం వ్యక్తం చేస్తోంది.సోషల్ మీడియా లో ఇప్పటికే హైపర్ ఆది స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ కార్యక్రమం లో జాయిన్ అయ్యాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
దాదాపు ఐదారు సంవత్సరాలుగా ఈ టీవీ పలు కార్యక్రమాలు హైపర్ ఆది చేసిన సందడి అంతా ఇంతా కాదు.
హైపర్ ఆది కామెడీ తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టం.
అయినా కూడా ఆయన తెలుగు ప్రేక్షకుల కోసం కాకుండా ఇతర కారణాలు చెప్పి మల్లెమాల వారు దూరం చేయడం విచారకరం అంటూ సోషల్ మీడియా వారు మరియు బుల్లి తెర వర్గాల వారు ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో జరుగుతున్నట్లుగా హైపర్ ఆది మరియు మల్లెమాల వారి మధ్య గొడవ తీవ్రతరమైంది అని అందుకే జబర్దస్త్ కి మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ కి మాత్రమే కాకుండా హైపర్ ఆది శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా వదిలేశాడని తేలి పోయింది.
హైపర్ ఆది కామెడీ టైమింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.అలాంటి హైపర్ ఆది ని ఈటీవీ వదులుకోవడం దురదృష్టకరం అంటూ ఆయన అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.మల్లెమాల వారు అడిగినంత పారితోషికం ఇచ్చి ఆయన్ను కంటిన్యూ చేయాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మళ్ళీ హైపర్ ఆది వస్తే చూడాలని కోరుకుంటున్నాము అంటున్నారు.ఈటీవీ లో కాకున్నా మరేదైనా ఛానల్ లో ఆయన రావాలని అభిమానులు పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు.సినిమాల్లో నటిస్తున్న కూడా బుల్లి తెరపై కూడా ఆయన కనిపించాలని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.