కిరణ్ అబ్బవరం 'సమ్మతమే' జూన్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కుతున్న “సమ్మతమే” చిత్రంలో మరో విభిన్నమైన పాత్రలో అలరించనున్నారు.గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చాందిని చౌదరి హీరోయిన్ గా సందడి చేస్తుంది.

 Kiran Abbavaram Sammathame Movie Releasing On June 24th World Wide Details, Kira-TeluguStop.com

ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంది.చిత్ర యూనిట్ ఇత్ప్పటికే విడుదల చేసిన రెండు పాటలు సూపర్‌హిట్ అయ్యాయి.యూజీ ప్రొడక్షన్స్‌లో కంకణాల ప్రవీణ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ క్యూరియాసిటీని పెంచుతోంది.

ఈ రోజు చిత్ర యూనిట్ సినిమా విడుదల తేదీని ప్రకటించింది.‘సమ్మతమే’ చిత్రం జూన్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లవ్లీ అండ్ క్యూట్ గా వుంది.

హీరోయిన్ చాందిని గార్డెన్‌లో బట్టలు ఆరవేస్తూ కనిపిస్తుండగా, కిరణ్ ఆమెను ప్రేమగా కౌగిలించుకున్న మూమెంట్ బ్యూటీఫుల్ గా వుంది.హ్యాపీ స్మైల్స్ తో వారిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది.

ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించగా, సతీష్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

తారాగణం:

కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి తదితరులు.

టెక్నికల్ టీమ్ :

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గోపీనాథ్ రెడ్డి, నిర్మాత: కంకణాల ప్రవీణ, బ్యానర్: యూజీ ప్రొడక్షన్స్, సంగీతం: శేఖర్ చంద్ర, డీవోపీ: సతీష్ రెడ్డి మాసం, ఎడిటర్: విల్పవ్ నైషదం, ఆర్ట్ డైరెక్టర్: సుధీర్ మాచర్ల, పీఆర్వో: వంశీ-శేఖర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube