సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' థియేట్రికల్ ట్రైలర్ మే 2న విడుదల

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఇప్పటికే అదిరిపోయే ప్రమోషనల్ కంటెంట్ తో దూసుకుపోతుంది.

 Superstar Mahesh Babu S Sarkaru Vaari Paata Theatrical Trailer On May 2nd , Mahe-TeluguStop.com

ఇప్పుడా అంచనాలని మరో స్థాయికి తీసుకువెళ్ళడానికి పక్కా మాస్, యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్‌ను సిద్ధం చేస్తోంది చిత్ర యూనిట్.తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారైయింది.

భారీ అంచనాలు నెలకొన్న ‘సర్కారు వారి పాట’ థియేట్రికల్ ట్రైలర్ మే 2న విడుదల కానుంది.ఈ సందర్భంగా విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ పోస్టర్ లో మహేష్ బాబు కంప్లీట్ యాక్షన్ లుక్ లో కనిపించారు.

రెండు చేతుల్లో తాళల గుత్తులు పట్టుకొని వంటికాలిపై నిల్చుని రౌడీ గ్యాంగ్ తో హైవోల్టేజ్ ఫైట్ చేస్తున్న విజువల్ ఈ పోస్టర్ లో కనిపించడం అభిమానులని అలరించింది.

సూపర్ స్టార్ మహేష్ బాబును మునుపెన్నడూ చూడని మాస్ రోల్ లో చూపించబోతున్నారు బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం.

ఈ చిత్రంలో డిఫరెంట్ షేడ్స్ వున్న పాత్రని పోషిస్తున్న మహేష్, తన పాత్ర కోసం సరికొత్తగా సూపర్ స్టైలిష్ గా మేకోవర్ అయ్యారు.సంగీత సంచలనం ఎస్ థమన్ ప్రస్తుతం ట్రైలర్ కోసం బీజీఏం స్కోర్ చేయడంలో బిజీగా ఉన్నారు.

సర్కారు వారి పాట రెగ్యులర్ అప్డేట్స్ తో సందడి చేస్తుంది.త్వరలోనే మహేష్ బాబు, కీర్తి సురేష్‌లపై చిత్రీకరించిన మాస్ సాంగ్‌ను కూడా విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది.

ఇప్పటికే విడుదలైన కళావతి, పెన్నీ , టైటిల్ ట్రాక్ .చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.త్వరలోనే విడుదల కానున్న నాల్గోవ పాట ‘మాస్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’ కానుంది.

కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఆర్ మధి సినిమాటోగ్రాఫర్ గా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు.

సర్కారు వారి పాట మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube