పాపం.. కొత్త పెళ్లి కూతురికి దిష్టి తీస్తుండగా..

ఒకప్పుడు ఫోటో దిగాలంటే స్టూడియోను వెతుక్కుంటూ వెళ్లాల్సిందే.లేదా పక్కూరు నుండో… సిటీ నుండో ఫోటో గ్రాఫర్ ని పిలిపించుకుని ఫోటో దిగాల్సిందే.

 Sadly While Focusing On The New Bride , Bride , Groom , Viral Latest , Viral Ne-TeluguStop.com

ఇంకా వీడియోలు అయితే కేవలం పెళ్లిళ్ల సమయంలోనే షూట్ చేసేవారు.టెక్నాలజీ పెరగడంతో అన్నీ ఇప్పడు నిమిషాల్లో జరిగిపోతున్నాయి.

స్మార్ట్ ఫోన్ చేతులోకి రావడంతో పాస్ ఫోటోల దగ్గర నుండి పెళ్లిళ్ల దాకా అన్నీ ఫోన్ లోనే జరిగిపోతున్నాయి.

స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండడంతో.

సోషల్ మీడియాలో ప్రతీరోజూ కొన్ని వందల వీడియోలు వైరల్ అవుతుంటాయి.సోషల్ మీడియా వచ్చినప్పటి నుండి ఏ వీడియో.ఎప్పుడు… ఎందుకు వైరల్ అవుతుందో మనకు తెలియదు.అందులో ఎన్నో రకాల వీడియోలు ఉంటాయి.

అసలు మనం గమనించని చిన్న విషయాలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంటాయి.నెటిజన్లు వాటిని ఎక్కువగా చూస్తారు.

లైక్ చేస్తారు.కామెంట్ చేస్తారు.

కొత్త కొత్త యాప్స్ మార్కెట్ లోకి రావడంతో తమ ట్యాలెంట్ ని నిరూపించుకునే అవకాశం ఎందరికో దక్కింది.దీంతో తమ ట్యాలెంట్‌ను వీడియోలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

తాజాగా అలాంటి వీడియోనే నెట్టింట ట్రెండ్ అవుతోంది.

ఓ వీడియోలో కొత్త పెళ్లి కూతురికి.

ఆమె తల్లి దిష్టి తీస్తుంది.దిష్టి తీసిన తర్వాత ఆ కొబ్బరికాయ పెళ్లి కూతురు తలపై నుంచి విసరాలనుకుంది.

కానీ దురదృష్టవశాత్తూ ఆ కొబ్బరికాయ నవ వధువు తలకు బలంగా తగులుతుంది.దీంతో ఆ నవ వధువుకు కాస్త గట్టిగానే దెబ్బ తగిలింది.

అక్కడున్న వారంతా కూడా ఒక్కసారిగా కంగుతిన్నారు.అయితే దిష్టి తీసిన తల్లి.

వెంటనే తన పొరపాటు తెలుసుకుని కూతురు దగ్గరుకు వెళ్లి కుమార్తెకు ఏమైనా జరిగిందేమోనని అడిగి తెలుసుకుంది.ఈ సంఘటనను వీడియో కట్ చేసి ఫ్రెండ్స్‌కు షేర్ చేశాడు.

అది కాస్తా క్షణాల్లో వైరలయ్యింది.దీనిపై నెటిజన్లు పలువురు కామెంట్లు చేస్తున్నారు.

ఈవీడియో వధూవరుల కుటుంబాలకు అసౌకర్యాన్ని కలిగించింది.పెళ్లి కూతురికి.

ఆమె తల్లి దిష్టి తీయబోతే అది కాస్తా మిస్ ఫైర్ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube