సాధారణంగా స్టేడియంలో మ్యాచ్ చూసి ఆనందించడానికి వచ్చిన అభిమానులు తమ దగ్గరకు వచ్చిన బాల్ కి అద్భుతంగా క్యాచ్ లు పట్టడం మనం ఎన్నోసార్లు చూసాం.మనం కూడా వాటిని చూసి ఔరా అనుకున్నాం కూడా.
కానీ మేజర్ లీగ్ బేస్ బాల్ గేమ్‌లో స్టేడియంలో పట్టిన క్యాచ్ మాత్రం వీటన్నింటికి ప్రత్యేకం.ఆ క్యాచ్ అంత ప్రత్యేకం అనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆ క్యాచ్ గురించి తెలుసుకుందాం.
మేజర్ లీగ్ బేస్ బాల్ గేమ్‌లో భాగంగా సిన్సిన్నాటీ రెడ్స్ వర్సెస్ శాన్ డిగో పాడ్రెస్ మ్యాచ్ జరిగింది.ఓ తండ్రి తన ఫ్యామిలీతో కలిసి బేస్ బాల్ మ్యాచ్ చూడటానికి గ్రౌండ్ కి వెళ్ళాడు అదే సమయంలో తన కూతురు ఏడవడంతో పాల బాటిల్ తో తన కూతురికి ఒక చేత్తో పాలు తాగిపిస్తున్నాడు.
అదే సమయంలో అదే సమయంలో బంతి స్టేడియంలోకి దూసుకొస్తుండడంతో.స్టేడియంలో కూర్చున్న ప్రేక్షకులంతా ఆ బంతిని పట్టుకోవడానికి కుతూహలంగా ఎదురుచూస్తున్నారు.
అయితే స్టాండ్ లో కూర్చొని ఒక చేత్తో పాపకు పాలు పడుతున్న తండ్రి మాత్రం చెయ్యెత్తి బంతి అందుకున్నాడు.అతని ఒళ్లో చూస్తే ఒక పాప.మరో చేత్తో ఆ పాపకు పాలు పడుతూనే ఉన్నాడు.

అది చుసిన ప్రేక్షకులు.అభిమానులు సైతం ఒక్కసారిగా షాక్ అయిపోయారు.ప్రత్యేకించి అతని పక్కనే కూర్చొన్న భార్య కూడా షాకింగ్ గా ఫీల్ అయింది.
అతను క్యాచ్ భలే అందుకున్నాడని అంతా కాంప్లిమెంట్ ఇస్తుంటే.ఆ తండ్రి మాత్రం పిల్లలను బయటకు తీసుకెళ్లేటప్పుడు సేఫ్టీ ముఖ్యమని తాను అప్రమత్తంగా ఉండటం వల్లే పట్టుకోగలిగానని చెప్తున్నాడు.
అది చూసిన పలువురు పిల్లల్ని ఇలా గ్రౌండ్స్ కి తీసుకురావడం అపాయం అంటుంటే.మరికొందరు ‘సూపర్ ఫాథర్’.
మీరు ఒక్క చేత్తో సూపర్ గా క్యాచ్ పట్టారంటూ కామెంట్స్ చేస్తున్నారు.