మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయి.మరణశిక్షకు గురైన భారత సంతతికి చెందిన నాగేంద్రన్ కే.
ధర్మలింగాన్ని ఈరోజు సింగపూర్ జైలులో ఉరి తీశారు.అయితే మరణశిక్షకు ముందు అతను తన కుటుంబ సభ్యులతో చివరిసారిగా గడిపాడు.
సింగపూర్‌కు 42 గ్రాముల హెరాయిన్ సరఫరా చేశాడని నాగేంద్రన్‌పై 2009లో అభియోగాలు నమోదయ్యాయి.అనంతరం అవి నిర్థారణ కావడంతో 2010లో ఆయనకు కోర్ట్ మరణశిక్ష విధించింది.దీంతో ధర్మలింగం.న్యాయస్థానాల్లో పలుమార్లు అప్పీళ్లు చేసుకున్నప్పటికీ ఫలితం దక్కలేదు.చివరకు సింగపూర్ అధ్యక్షుడిని క్షమాభిక్ష కోరినన్నప్పటికీ అక్కడా నిరాశే ఎదురైంది.11 ఏళ్ల క్రితం పడిన మరణశిక్ష గతేడాది నవంబర్ 10వ తేదీన అమలు కావాల్సి ఉంది.అయితే నాగేంద్రన్‌కు కొవిడ్ సోకడం, మానసిక అంగవైకల్యం కారణంగా మరణశిక్ష మరోసారి వాయిదా పడింది.ఊహించని పరిణామాలు చోటుచేసుకోవడంతో ఈ కేసుపై ఆసక్తి పెరిగింది.దీంతో మార్చి 29న నాగేంద్రన్ చేసుకున్న తుది అప్పీల్‌పై విచారణ సందర్భంగా కోర్టు ప్రాంగణం మొత్తం అంతర్జాతీయ మీడియా, స్థానిక ఆందోళనకారులతో కిక్కిరిసిపోయింది.
మానసిక వైకల్యం వున్న వారిని ఉరితీయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని వాదిస్తూ నాగేంద్రన్ తరపు న్యాయవాదులు చివరి అప్పీల్‌ను దాఖలు చేశారు.
కానీ న్యాయస్థానం దీనిని తిరస్కరించింది.సింగపూర్ ప్రధాన న్యాయమూర్తి సుందరేష్ మీనన్ స్పందిస్తూ.దీనికి చట్టపరమైన ఆధారం లేదన్నారు.అంతర్జాతీయ చట్టం కంటే దేశీయ చట్టానికే ప్రాధాన్యత వుంటుందని సుందరేష్ పేర్కొన్నారు.
విచారణ దశలో నాగేంద్రన్‌కు తగిన న్యాయ ప్రక్రియను అందించామని ఆయన అన్నారు.తీర్పు సందర్భంగా ఊదారంగు జైలు దుస్తులను, ముఖానికి తెల్లటి మాస్క్‌ను ధరించి నాగేంద్రన్ ముభావంగా కనిపించాడు.

అలాగే ఏప్రిల్ 27న ఉదయం ఉరిశిక్షను అమలు చేయాల్సిందిగా న్యాయస్థానం అధికారులను ఆదేశించింది.ఆ సమయంలో చివరిసారిగా తన కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపాలని కోరుకుంటున్నాను అని తెలిపాడు.అందుకు కోర్టు సమ్మతించింది.న్యాయస్థానం ఆదేశాల మేరకు బుధవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో నాగేంద్రన్‌ను కల్పించి, అనంతరం ఉరిశిక్షను అమలు చేశారు అధికారులు.మలేషియాలోని ఇపో పట్టణంలో నాగేంద్రన్ అంత్యక్రియలు నిర్వహిస్తామని అతని సోదరుడు నవీర్ మీడియాకు తెలిపాడు.







