ఈ వీడియో చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే!

రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము.ఒక్కోసారి మన వాహనం అదుపుతప్పి వేరే వాహనాలను ఢీ కొట్టడం.

 Viral Video Mother Saves Her Kid Falling Under A Truck In Road Accident In Vietn-TeluguStop.com

మరోసారి మనం జాగ్రత్తగా వెళ్తున్నా ఎదుటివారు వచ్చి మన వాహనానికి డాష్ ఇవ్వడం చూస్తూనే ఉంటాం.ఇలాంటి సంఘటనలలో కొన్నిసార్లు అయితే రెప్పపాటులో ప్రమాదం నుండి బయటపడతాం.

కొన్నిసార్లు అయితే విగత జీవులుగా మారను వచ్చు.ఇలా రెప్పపాటులో ప్రమాదం నుండి బయటపడిన కోవకు చెందిన ఓ వీడియో మరోసారి వైరల్ అవుతుంది.2019లో వియత్నంలోని గోయ్ నామ్ దిన్ ప్రాంతంలోని రహాదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది.

ఒక కుటుంబం తమ బైక్ పై రోడ్డుపై ప్రయాణిస్తున్నారు.

బైక్ వెనుక ఒక మహిళ తన బిడ్డను ఎత్తుకుని వెనుకాల కూర్చుంది.అప్పుడు ఒక కారు వేగంగా వచ్చి వారు ప్రయాణిస్తున్న బైక్ ని ఢీకొట్టింది.

దీంతో బైక్ ఒక్కసారిగా అదుపుతప్పడంతో వెనుక కూర్చున్న తల్లి, బిడ్డలు బోర్లుకుంటూ కిందపడ్డారు.కిందపడి పక్కకు చూసే లోపు వారివైపు ఒక ట్రక్ వేగంగా దూసుకొస్తోంది.

అప్పుడు ఒక షాకింగ్ ఘటన జరిగింది.

తల్లి, తన బిడ్డతో పాటు.

జారుకుంటూ ట్రక్ కిందకు వెళ్తున్నారు.

ఆ క్షణంలో మెరుపు వేగంతో స్పందించిన తల్లి.తన బిడ్డను ట్రక్ టైర్ల కింద వెళ్లకుండా పక్కకు లాగింది.తాను కూడా వేగంతో కిందకు జారీంది.

దీంతో ఒక్కసారిగా వారు రెప్ప పాటు కాలంలో కాలంలో ప్రమాదం నుంచి బయట పడ్డారు.ఈ ప్రమాదం ఎప్పుడో జరిగింది.

ప్రస్తుతం దీన్ని ఇంగ్లండ్ ఆల్ రౌండర్ జోఫ్రా ఆర్చర్ తన ఇన్ స్టాలో షేర్ పోస్ట్ చేశారు.ఆ సదరు మహిళను సమయ స్ఫూర్తికి అభినందిస్తూ… ‘మదర్ ఆఫ్ ది ఇయర్’ అంటూ రాసుకొచ్చారు.

ప్రస్తుతం ఈ వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube