నేడు తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ ఆవిర్భావ సభ ఘనంగా జరగబోతుంది.టిఆర్ఎస్ ఆవిర్భవించి 21 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించబోతున్న ఈ సభను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తోంది.
ఈ మేరకు భారీగా ఏర్పాట్లను పూర్తి చేశారు.హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉన్న హెచ్ ఐ సీ సీ లో బుధవారం పార్టీ ప్రతినిధులతో జరగబోతున్న ఈ ప్లీనరీకి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి టిఆర్ఎస్ ముఖ్య నాయకులు హాజరుకాబోతున్నారు.
ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు .ఇప్పటికే ఏడు కమిటీలను నియమించి ఈ కమిటీ ఆధ్వర్యంలో నే సభ ఏర్పాట్లను పూర్తి చేశారు.మొత్తం 3600 మంది ఆహ్వానాలు అందించారు.ఈ ప్లీనరీకి రాష్ట్రం నలుమూలల నుంచి టిఆర్ఎస్ ముఖ్య నాయకులు హాజరు కాబోతూ ఉండడం తో భారీగానే స్వాగత తోరణాలు , ప్రధాన కూడళ్లలో పార్టీ జెండాలు, కేసిఆర్ కటౌట్లతో భారీగా ఏర్పాట్లు చేశారు.
ఆహ్వానాలు అందించిన 3600 మంది తో పాటు, వారి సిబ్బంది తో సహా మొత్తం ఆరు వేల మందికి సరిపడా భోజన ఏర్పాట్లు చేసుకున్నారు.గతంలో ఎప్పుడూ లేనివిధంగా సభకు వచ్చే కీలక నాయకులకు బార్ కోడ్ తో కూడిన ప్రత్యేక పాసులను జారీ చేశారు .బార్ కోడ్ తో స్కాన్ చేసిన తర్వాత మాత్రమే ప్రతినిధులకు లోనికి అనుమతి ఉంటుంది.ఈ ప్లీనరీలో అనేక రాజకీయ అంశాలపై కీలక నిర్ణయాలు తీర్మానాలు చేయబోతున్నారు.
మొత్తం పదకొండు అంశాలకు సంబంధించిన చర్చ జరగబోతోంది.సభావేదికపై తెలంగాణ తల్లి విగ్రహం తోపాటు, అమరవీరుల స్థూపం ఏర్పాటు చేస్తున్నారు.11 గంటలకు కెసిఆర్ జెండాను ఆవిష్కరించి తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు.11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతినిధుల సభ జరగనుంది.ఈ సభ ఆవరణలోనే 2001 నుంచి 2014 వరకు కెసిఆర్ ఉద్యమంలో పాల్గొన్న వివిధ సందర్భాలకు సంబంధించిన ఫోటోలతో గ్యాలరీని ఏర్పాటు చేశారు.భోజన ఏర్పాట్లు భారీగానే చేశారు.

భోజనంలో వెరైటీలు ఇవే :
మొత్తం 33 రకాల ఐటమ్స్ ను సిద్ధం చేశారు.డబుల్ కామీటా, గులాబ్ జామ్, మిర్చి బజ్జీ, రుమాలి రోటి , తెలంగాణ నాటు కోడి కూర, చికెన్ దమ్ బిర్యాని, దమ్ కా చికెన్, మిర్చి గసాలు, ఆనియన్ రైతా, మటన్ కర్రీ, , తలకాయ కూర, బోటి దాల్చా, కోడి గుడ్డు పులుసు, బగారా రైస్, మిక్స్డ్ వెజ్ కుర్మా, వైట్ రైస్, మామిడికాయ పప్పు, దొండకాయ, కాజు ఫ్రై, గుత్తి వంకాయ, చామగడ్డ పులుసు, ములక్కాడ, కాజు, టమాటా కర్రీ, వెల్లి పాయ కారం, టమాటా ,కొత్తిమీర తొక్కు, మామిడికాయ తొక్కు, పప్పుచారు అప్పడం, పచ్చి పులుసు, ఉలవచారు క్రీం, టమాటా రసం, పెరుగు, బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్, ఫ్రూట్ స్టాల్, అంబలి, బట్టర్ మిల్క్
.