సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.అనిల్ రావిపూడి తనదైన మార్క్ టైమింగ్ తో, డైలాగ్ లతో వరుస విజయాలను అందు కుంటున్నాడు.
ప్రెసెంట్ అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3‘ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.
ఇక ఈయన చేస్తున్న ఎఫ్ 3 సినిమా ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా వస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు.
వీరిద్దరికి జోడీగా తమన్నా భాటియా, మెహ్రీన్ నటిస్తున్నారు.ఈ సినిమా నుండి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్ పాటలు అన్ని కూడా అలరించాయి.
ఇక ఇటీవలే మరో పాట కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.ఈ పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఇప్పుడు ఈ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేసారు.
ఈ వీడియో ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టు కుంటుంది.57 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో రిలీజ్ చేయడంతో మరో సారి ఈ సినిమాపై హైప్ పెరిగింది.ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను మే 27న రిలీజ్ చేయనున్నారు.
ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.అప్పుడు సంక్రాంతి అల్లుళ్లుగా వచ్చిన వెంకటేష్, వారు ఇప్పుడు సంక్రాంతి సోగాళ్లుగా రాబోతున్నారు.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.మరి ఈసారి సోగాళ్ళు ఎలా అలరిస్తారో చూడాలి.ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి బాలయ్య తో సినిమా చేయనున్నాడు.ఈ సినిమా కూడా ఆయన స్టైల్ లోనే తెరకెక్కించ బోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే పూర్తి అయినా స్క్రిప్ట్ బాలయ్యకు వినిపించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్.







