ప్రస్తుతం టాలీవుడ్ పేరు దేశమంతటా మారుమ్రోగిపోతోంది.గత మూడు సంవత్సరాలుగా సినిమా పరిశ్రమ ఎక్కువగా లాభాలు సాధించిన దాఖలాలు లేవు.
దీనికి కారణం, కంటికి కనిపించని మహమ్మారి కరోనా వైరస్ మానవజాతిపై విరుచుకుపడడమే.దీని వలన అన్ని ఇండస్ట్రీలు దారుణంగా నష్టపోయాయి,.
అందులో సినిమా పరిశ్రమ కూడా ఒకటి అని చెప్పాలి.అయితే గత సంవత్సరం నుండి సినిమా పరిశ్రమ జోరుగా ముందుకు వెళుతోంది.
కరోనా ముందు వరకు చాలా సినిమాలు షూటింగ్ దశలో ఉండగానే ఆగిపోయిన సంగతి తెలిసిందే.అయితే నెమ్మది నెమ్మదిగా మినహాయింపులు ఇచ్చిన తర్వాత ఒకటి ఒకటి షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల అవుతూ వచ్చాయి.
ఆలా వచ్చిన సినిమాలలో ఉప్పెన, క్రాక్ లాంటివి హిట్ సాధించాయి.
ఇక పెద్ద సినిమాలుగా చెప్పుకునే పుష్ప, రాధేశ్యామ్, ఆర్ ఆర్ ఆర్, ఆచార్య, కేజిఎఫ్ 2 వంటి బడా బడ్జెట్ సినిమాలు కూడా థియేటర్ లు, సరైన సమయం కోసం వేచి చూస్తూనే ఉన్నాయి.
కానీ వీటిలో కొన్ని సినిమాలు మాత్రం కరోనా కారణంగా దొరికిన కాస్త సమయాన్ని సినిమాలో క్వాలిటీ పెంచేందుకు వాడుకున్నారు.అంటే సినిమాలో కొన్ని సీన్ లను రీ షూట్ చేసారు.
ఆ తర్వాత విడుదల అయినా పుష్ప , ఆర్ ఆర్ ఆర్ మరియు కేజిఎఫ్ 2 లు బ్రహ్మాండమైన సక్సెస్ సాధించగా ఎన్నో అంచనాలతో వచ్చిన రాధేశ్యామ్ మాత్రం దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది.
అయితే ఇలా ఉండగా ఇప్పుడు తర్వాత రిలీజ్ అయ్యే సినిమాలలో ముందుకి వరుసలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య ఉంది.
ఇప్పటి వరకు చిత్ర బృందం ప్రకటించిన తేదీని బట్టి ఈ సినిమా ఏప్రిల్ 29 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది.అయితే సినిమా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రీ షూట్ కు వెళ్లిందని తెలుస్తోంది.
దీనిని బట్టి సినిమా రిలీజ్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి.దీనికి కారణం లేకపోలేదు, ఈ మధ్యనే ఆచార్య సినిమా స్టోరీ లీక్ అయినట్లు వార్తలు వచ్చాయి.
అందుకనే సినిమాలో మరింత ఖ్యాలిటీ పెంచేందుకు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ సినిమాలో కొన్ని సీన్స్ ను రీ షాట్ చేసి ఉంటాడని వార్తలు వస్తున్నాయి.

అంతేకాదు ఈ విషయంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.ఎందుకు ఆచార్య రీ షాట్ కు వెళుతోంది ? సినిమా కథపై నమ్మకం లేదా ? కొరటాల మొదటిసారి తప్పటడుగు వేస్తున్నాడా ? అంటూ రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి.అయితే ఈ సినిమాలో చిరంజీవి నటిస్తుండడం మరియు మల్టీ స్టారర్ కావడం చేత ఛాలెంజ్ గా తీసుకున్నాడు.
చిరంజీవి ప్రోద్భలం వల్లనే కొరటాల రీ షూట్ చేసి ఉంటాడని వార్తలు వస్తున్నాయి.గతంలో ఉన్న చాలా మంది హీరోలు కూడా సినిమా హిట్ అవ్వాలని ఉద్దేశ్యం తోనే డైరెక్టర్ దగ్గరకు వెళ్ళి అన్ని విషయాలు చర్చించుకుని అవసరం అయితే రీ షూట్ కు వెళ్లడం, కథలో మార్పులు చేసుకోవడం జరుగుతూ ఉండేవి.
దానిని బట్టి ఆచార్య సినిమా రీ షూట్ కు వెళ్లడంలో తప్పు లేదని ప్రముఖ జర్నలిస్ట్ భరద్వాజ్ ఒక ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చారు.