ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క విషయంలో సెంటిమెంట్ అనేది ఉంటుంది.ఏదైనా ఒక వస్తువు, ఒక నెంబరు, ఒక రంగు ఇలా ఏదో ఒక దానిలో తమ సెంటిమెంట్ ను బయట పెడుతూ ఉంటారు.
అలా కేవలం సామాన్య ప్రజలకే కాకుండా.సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లకు, రాజకీయ నాయకులకు కూడా సెంటిమెంట్లు అనేవి ఉంటాయి.
ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లకు మాత్రం సెంటిమెంట్ల విషయంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
సినిమా షూటింగ్ ను ప్రారంభించినప్పటి నుంచి సినిమా విడుదల వరకు ఏదో ఒక సెంటిమెంట్ ను ఫాలో అవుతుంటారు.
కేవలం ఆ సినిమాకు సంబంధించిన హీరో లే కాకుండా దర్శకులు, నిర్మాతలు, ఇతర టెక్నీషియన్లు ప్రతి విషయంలో సెంటిమెంట్ ను ముందుకు లాగుతూ ఉంటారు.ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలకు, డైరెక్టర్లకు కొన్ని సెంటిమెంట్లు ఉన్నాయి.
చాలావరకు తమ సెంటిమెంట్లను సినిమా విషయంలోనే వాడుతూ ఉంటారు.వ్యక్తిగత విషయంలో కూడా సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారు సినీ ప్రముఖులు.
గతంలో డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా తన సెంటిమెంట్ ను బయటపెట్టాడు.ఒక ప్లేస్ లో కూర్చుంటే తనకు మంచి కథలు వస్తాయని అవి బాగా సక్సెస్ అవుతాయని.
ఆ స్థలమే తనకు సెంటిమెంట్ అని అన్నాడు.
ఇక తాజాగా డైరెక్టర్ కొరటాల శివకు కూడా ఒక సెంటిమెంట్ ఉందని.
అది కూడా హీరోల పైనే.తన సెంటిమెంట్ ను చూపిస్తాడని తెలుస్తుంది.

తెలుగు సినీ ఇండస్ట్రీలో కొరటాల శివ దర్శకత్వం గురించి అందరికీ తెలిసిందే.తన దర్శకత్వంతో మంచి మంచి సినిమాలను తెరకెక్కించి మంచి సక్సెస్ లు అందుకుంటున్నాడు.చాలావరకు స్టార్ హీరోలతో సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు.
దర్శకుడిగానే కాకుండా రచయితగా కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
ఇక ఈయనకు కూడా తన సినిమాల విషయంలో ఒక సెంటిమెంట్ ఉందని తెలిసింది.ఇంతకూ అదేంటంటే.
కొరటాల శివకు బ్రౌన్ కలర్ అంటే చాలా ఇష్టమని.అందుకే ఆయన సినిమాలలో చాలా వరకు హీరోలంతా క్లైమాక్స్ లో బ్రౌన్ కలర్ షర్ట్ తో కనిపిస్తారు అని తెలిసింది.
అంటే ఈ కలర్ వల్ల తనకు బాగా కలిసి వస్తుందని నమ్మకం అని అర్థమయింది.

దీంతో ఆయన అభిమానులు ఆయన సెంటిమెంట్ ను బాగా ఇష్టపడుతున్నారు.ఇక ప్రస్తుతం ఈయన దర్శకత్వంలో ఆచార్య సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.ఇందులో మెగా హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ కీలక పాత్రల్లో నటించారు.
ఇక ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.ఇక ఇందులో కూడా కొరటాల తన సెంటిమెంట్ ను హీరోల మీద ప్రయోగించాడు అని తెలుస్తుంది.
మరి ఈ సెంటిమెంట్ తో కొరటాల శివ ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకోవడం ఖాయమని అర్థమవుతుంది.







