జీవిత మా కాళ్ళు పట్టుకుంది.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన నిర్మాత?

తెలుగు సినీ ఇండస్ట్రీలో జీవిత రాజశేఖర్ ల పేర్లు హాట్ టాపిక్ గా మారాయి.చీటింగ్ కేసులో భాగంగా జీవిత, రాజశేఖర్ ల పేర్లు మారుమోగుతున్నాయి.

 Producer And Jeevitha Rajasekhar Blame Each Other Over Cheating Issue Details,-TeluguStop.com

గరుడవేగ సినిమా నిర్మాత అయిన కోటేశ్వర రాజు జీవితా పై చీటింగ్ కేసు పెట్టిన విషయం తెలిసిందే.వారి వద్ద 26 కోట్లు అప్పు తీసుకొని ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇదే విషయంపై జీవిత స్పందిస్తూ.మేము ఎవరికీ భయపడను, ఏదైనా ఉంటే కోర్టులో చూసుకుంటాము.

మాపై తప్పుడు కేసు పెట్టిన వాళ్ళు ఉత్తములు కాదు వారు మా పరువు తీయడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పుకొచ్చింది జీవిత.

ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.

ఇదిలా ఉంటే తాజాగా నిర్మాత కోటేశ్వర రాజు మరొకసారి ప్రెస్ మీట్ పెట్టి జీవిత-రాజశేఖర్ మోసాలను బయటపెట్టడం చర్చనీయాంశంగా మారింది.ప్రెస్ మీట్ లో భాగంగా నిర్మాత కోటేశ్వర రాజు మాట్లాడుతూ.

జీవిత చేస్తున్న ఆరోపణలను అన్ని కూడా అసత్యాలే.కేవలం నేను ఒక్కడిదే కాదు చాలామంది నిర్మాతలను ట్రాప్ చేసి డబ్బులు గుంజుతోంది అని తెలిపాడు.

కానీ మేము అందరిలా కాదు లండన్ నుంచి వచ్చాము.ఆమె ట్రాప్ లో పడము.

ఇంకా చెప్పాలి అంటే ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే టైపు మేము అని తెలిపాడు.

జీవిత ఆమె మామ వరదరాజన్ తన ఇంటికి వచ్చి డబ్బులు అడిగారని, అప్పుడు జీవిత మా కాళ్ళు కూడా పట్టుకుంది అని తెలిపాడు.

Telugu Garudavega, Rajasekhar, Jeevitha, Koteswara Raju, Raja Shekar-Movie

అప్పుడు జీవిత వాళ్ళ మామ ఆమె కాళ్లు పట్టుకుంది అని కాదు కానీ నా ముఖం చూసి అయినా ఇవ్వండి అని చెప్తే డబ్బులు ఇచ్చాను అని తెలిపాడు నిర్మాత కోటేశ్వర రాజు.ఆ సమయంలో వాళ్ళ మామ కూడా కోడలు గురించి చాలా బాధ పడ్డాడు అని తెలిపాడు.జీవిత భర్త రాజశేఖర్ కు డబ్బు అవసరం లేదని, అతని భార్య జీవితకు డబ్బు అవసరం ఉందని, ఇలా సినిమా ముసుగులో ఎంతో మంది వద్ధ అప్పు చేసిందని తెలిపి ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఆమె తిరిగి మమ్మల్ని ఇరికించాలని చూస్తోంది కానీ మమ్మల్ని ఇరికించడం ఆమె తరం కాదు.

డబ్బులు తీసుకున్న రోజు మేము రాజశేఖర్ కు దేవుడిలా కనిపించాము.కానీ ఇప్పుడు డబ్బులు అడుగుతుంటే అలా కనిపించడం లేదా మీ బుద్ధులు ఎవరికీ తెలియవు అంటూ మీడియా ముందు అసలు నిజాలు బయట పెట్టేసాడు నిర్మాత కోటేశ్వర రాజు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube