కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ఆచార్య.ఈ సినిమా ఈ నెల 29 వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా కొరటాల శివ పలు ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఇకపోతే ఈ సినిమాలో మెగాస్టార్ సరసన నటించిన కాజల్ అగర్వాల్ పాత్ర ఏమాత్రం లేదని ఆమె నటించిన సీన్లన్నీ కూడా ఎడిట్ చేశారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలోనే ఈ వార్తలపై కొరటాల శివ క్లారిటీ ఇస్తూ అసలు విషయం వెల్లడించారు.ఈ సందర్భంగా కొరటాల శివ మాట్లాడుతూ ఆచార్య సినిమాలో ఆచార్య పాత్రకు హీరోయిన్ లేకపోయినా పెట్టాలని నిర్ణయించుకున్నాము ఈ క్రమంలోని ఆ పాత్రలో నటించడానికి కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేసినట్లు కొరటాల తెలిపారు.
అయితే కాజల్ పాత్ర రాసుకున్న సమయంలోనే ఈ పాత్రపై పలు సందేహాలు వచ్చాయి.అయితే కాజల్ పై నాలుగు రోజులు షూటింగ్ జరిపిన అనంతరం కాజల్ పాత్రకు కంక్లూజన్ లేకపోవడంతో ఈ పాత్రను పెట్టడం అనవసరం అని భావించి ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి, కాజల్ కి తెలియజేశాను.

ఈ విషయం చెప్పిన తర్వాత కాజల్ అగర్వాల్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.అయితే ఈ సినిమాలో లాహే లాహే అనే పాటలో కాజల్ అగర్వాల్ డాన్స్ చేస్తున్నట్లు మనకు చూపించారు అయితే ఈ పాటలో అయిన కాజల్ అగర్వాల్ మనకు కనిపిస్తుందా? లేదా? అనే ప్రశ్న ఎదురవడంతో ఈ ప్రశ్నకు సమాధానం సినిమా చూడాలంటూ కొరటాల వెల్లడించారు.ఈ విధంగా కాజల్ అగర్వాల్ ఆచార్య సినిమాలో నటిస్తుందని ఆమె అభిమానులు ఎంతో సంబరపడ్డారు.అయితే ప్రస్తుతం ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ నటించడంలేదని తెలియడంతో కాజల్ అభిమానులు కాస్త నిరాశకు లోనైనట్లు తెలుస్తోంది.







