వేసవిలో కాకర సాగుకు పెరిగిన డిమాండ్!

ప్రజల శారీరక ఆరోగ్యానికి, రైతుల ఆర్థిక ఆరోగ్యానికి కాకర ఎంతో ఉత్తమమైనదిగా నిరూపితమయ్యింది.కాకర సాగుతో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.

 Emand For Bitter Gourd Cultivation In Summer! ,bitter Gourd, Farming , Marke-TeluguStop.com

కాకర గురించి గురించి చెప్పుకోవాల్సివస్తే.వేసవి కాలంలో కాకర దిగుబడి అధికంగా ఉన్నకారణంగా వీటిని చాలామంది ఈ కాలంలో తింటారు.

అలాగే రకరకాల వంటలు చేస్తారు.కాకర దాదాపు దేశమంతటా దొరుకుతుంది.

ఇది చేదుగా ఉన్నప్పటికీ చాలామంది దీనితో పలు రకాల వంటకాలు చేస్తుంటారు.కాకర అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది.

వేసవి కాలంలో మార్కెట్‌లో కాకరకు డిమాండ్ కూడా పెరుగుతుంది.కాకరకాయ.

మన నోటికి విభిన్న రుచిని అందించడమే కాకుండా.దీనిని సాగుచేసే రైతుల జీవితాల్లో తీపిని నింపుతుంది.

రైతులందరూ తక్కువ ఖర్చుతో కాకరను సాగుచేయవచ్చు.కాకరకాయ ఒక కూరగాయ అలాగే ఔషధం.

ఇది పలు తీవ్రమైన వ్యాధుల నుండి మనిషిని కాపాడుతుంది.కాకర మనకు అందించే ప్రయోజనాల గురించి డాక్టర్ ఆర్కే గుప్తా మాట్లాడుతూ కాకర కాయ తొక్కను తురిమి పచ్చిగా తినడం వల్ల కఫం తొలగిపోతుంది.

షుగర్‌తో పాటు రక్తపోటు నియంత్రణకు కాకర చాలా మేలు చేస్తుంది.ఇది రక్త శుద్ధికి ఎంతగానో దోహదపడుతుంది.దీని ఘాటైన రసం ఆకలిని పెంచుతుంది.ఇది జీర్ణశక్తిని పెంపొందిస్తుంది.

పరిశోధక విద్యార్థిని కోమల్ కుమారి మాట్లాడుతూ.తాను వారంలో రెండు రోజుల పాటు తప్పనిసరిగా ఇంటిలో కాకరకాయ వండుతానని తెలిపారు.కాకరకాయను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తినాలన్నారు.ఇది పలు వ్యాధుల నివారణలో చక్కగా పనిచేస్తుందని అన్నారు.అలాగే మలబద్ధకం రోగులకు ఉపశమనం కలిగించేలా దీనిలో ఫైబర్ ఉందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube