టాలీవుడ్ ఇండస్ట్రీలోని క్యూట్ జోడీలలో అల్లు అర్జున్ స్నేహారెడ్డి జోడీ కూడా ఒకటనే సంగతి తెలిసిందే.పుష్ప ది రైజ్ సక్సెస్ తో బన్నీ రేంజ్ ఊహించని స్థాయిలో పెరిగింది.పుష్ప2 సినిమాను మరింత భారీ బడ్జెట్ తో మేకర్స్ తెరకెక్కించనున్నారనే సంగతి తెలిసిందే. సుకుమార్ ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులను పూర్తి చేయగా సుకుమార్ మరింత పవర్ ఫుల్ కథతో పుష్ప2 సినిమాను తెరకెక్కించనున్నారని బోగట్టా.
అతి త్వరలో పుష్ప2 సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని సమాచారం అందుతోంది.మరోవైపు బన్నీ భార్య స్నేహారెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.
స్నేహారెడ్డికి కూడా రికార్డు స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.బన్నీ భార్య స్నేహారెడ్డి తాజాగా అభిమానులతో ముచ్చటించారు.
బన్నీ ఫ్యాన్స్ స్నేహారెడ్డిని అల్లు అర్జున్ కు ఇష్టమైన ఆహారం ఏమిటని అడిగారు.

అయితే స్నేహారెడ్డి మాత్రం బిర్యానీ అంటే బన్నీకి చాలా ఇష్టమని వెల్లడించడం గమనార్హం.తమ ఫేవరెట్ హీరో బిర్యానీని ఎంతో ఇష్టంగా తింటాడని తెలిసి అభిమానులు ఆశ్చర్యపోవడంతో పాటు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ చేస్తున్నారు.బన్నీ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 60 కోట్ల రూపాయల స్థాయిలో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు.

పుష్ప2 సినిమా సక్సెస్ సాధిస్తే బన్నీ రెమ్యునరేషన్ మరింత పెరగనుందని సమాచారం అందుతోంది.బన్నీ ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేయడం కంటే నిదానంగా సినిమాలు చేసినా ఆచితూచి సినిమాలు చేయడమే కరెక్ట్ అనే భావనలో ఉన్నారు.అల్లు అర్జున్ ఇప్పటికే పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సంపాదించుకున్నారనే సంగతి తెలిసిందే.తనకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ ను మరింత పెంచే సినిమాలకు మాత్రమే ఓటెయ్యాలని ఈ స్టార్ హీరో భావిస్తున్నారు.







